భారీ సినిమాకు మోదీ మద్దతు..! | Sakshi
Sakshi News home page

భారీ సినిమాకు మోదీ మద్దతు..!

Published Mon, Jun 5 2017 2:38 PM

భారీ సినిమాకు మోదీ మద్దతు..! - Sakshi

భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్తో మహాభారత కథ సినిమా తెరకెక్కించేందుకు మలయాళ పరిశ్రమ సిద్ధమవుతోంది. ఎమ్టీ వాసుదేవన్ రాసిన రంథమూలం నవల ఆధారంగా మోహన్ లాల్ ప్రధాన పాత్రలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో రెండు భాగాలుగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇంకా సెట్స్ మీదకు కూడా వెల్లని ఈ సినిమాపై అప్పుడూ వివాదాలు మొదలయ్యాయి.

కేరళకు చెందిన హిందూ ఐక్య వేది అనే సంస్థ ఈ సినిమాకు మహాభారతం అనే టైటిల్ను పెట్టడాన్ని వ్యతిరేకిస్తోంది. ఆ టైటిల్ కేవలం వ్యాసుడికే సొంతమని.. ఆ పేరుతో ఎవరు సినిమా చేసిన అడ్డుకుంటామని హెచ్చరిస్తోంది. ఈ సమయంలో అనూహ్యం చిత్రయూనిట్కు దేశ ప్రధాని మోదీ మద్దతు లభించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మోదీ ఆఫీసు నుంచి చిత్రయూనిట్ను అభినందిస్తూ ఓ లేక వచ్చిందని, దేశానికే గర్వకారణమైన సినిమాను తెరకెక్కిస్తుంన్నందుకు ఆయన యూనిట్ సభ్యులను అభినందించినట్టుగా చెపుతున్నారు. అంతేకాదు మహాభారతం యూనిట్కు మోదీ అపాయింట్మెంట్ ఇచ్చారన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement