రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్‌ మృతి | army jawan died in road accident at kurnool district | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్‌ మృతి

Jan 12 2018 12:52 PM | Updated on Aug 30 2018 4:17 PM

కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది.

సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆర్మీ జవాన్‌ మృతిచెందాడు. నంద్యాల- ఆత్మకూరు రోడ్డులో శుక్రవారం బుల్లెట్‌పై వెళ్తున్న జవాన్‌ నివాస్‌రెడ్డిని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో అతను సంఘటనా స్థలంలోనే కన్నుమూశాడు. సంక్రాంతి పండుగ కోసం నివాస్‌ రెడ్డి సెలవుపై వచ్చినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. అతని మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement