రోడ్డు ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు | students seriously injured in bike accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు

Jan 29 2018 6:14 PM | Updated on Jan 29 2018 6:15 PM

students seriously injured in bike accident - Sakshi

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నకంచం సతీష్‌

తిరుమలాయపాలెం :  మండలంలోని కొక్కిరేణి స్టేజీ సమీపంలో శనివారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్‌సీఎం బోర్డింగ్‌ హాస్టల్‌లో ఉంటున్న ఆరుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తిరుమలాయపాలెం మండల కేంద్రంలోని ఆర్‌సీఎం బోర్డింగ్‌ హాస్టల్‌లో ఉంటూ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులను హాస్టల్‌ వార్డెన్‌ జూగుట్ల ప్రభాకర్‌రావు శనివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో రెండు మోటార్‌ సైకిళ్లపై ఖమ్మంలో సెకండ్‌షో సినిమాకు తీసుకవెళ్లాడు.

తిరుగు ప్రయాణంలో ఓ మోటార్‌ సైకిల్‌ రిపేరుకి రావడంతో అర్థరాత్రి సమయంలో ఆరుగురు విద్యార్థులను ఒకే మోటార్‌ సైకిల్‌పై ఎక్కించుకుని తిరుమలాయపాలెం కొక్కిరేణి స్టేజి సమీపంలోకి రాగానే అదుపుతప్పి మోటార్‌ సైకిల్‌ పడిపోయింది. ఈ సంఘటనలో విద్యార్థులు నీలం మహేష్, కంచం సతీష్, మిద్దె ప్రతాప్, బానోత్‌ తరుణ్, రంజిత్‌ కుమార్, దారావత్‌ నాగేందర్‌కు కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలు కాగా వీరిని 108లో ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి  తరలించారు. అజాగ్రత్తతో పాటు అపరిమితంగా వాహనంపై ఎక్కించుకుని పిల్లల ప్రమాదానికి కారణమైన వార్డెన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement