బైక్‌పై స్టంట్స్‌ చేస్తూ యువకుల దుర్మరణం | Three Youth Deceased Performing Stunts On Bike In Bengaluru | Sakshi
Sakshi News home page

బైక్‌పై స్టంట్స్‌: ముగ్గురు యువకుల దుర్మరణం

Jun 21 2020 5:29 PM | Updated on Jun 21 2020 6:03 PM

Three Youth Deceased Performing Stunts On Bike In Bengaluru - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

బెంగ‌ళూరు: బైక్‌పై స్టంట్స్ చేస్తూ ముగ్గురు యువ‌కులు దుర్మరణం పాలైన ఘటన బెంగు‌ళూరులో ఆదివారం చోటుచేసుకుంది. బెంగుళూరు ఎయిర్‌పోర్టుకు వెళ్లే దారిలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసుల వివ‌రాల ప్ర‌కారం.. న‌గ‌రంలోని గోవింద‌పురకు చెందిన ముగ్గురు యువ‌కులు ఆదివారం ఉద‌యం బెంగు‌ళూరు విమానాశ్రయం రోడ్డుకు వెళ్లి బైకుపై విన్యాసాలు చేశారు. అయితే, వారు స్టంట్స్ చేస్తున్న సమయంలో ఒక్క‌సారిగా బైక్‌ అదుపుత‌ప్పి ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. దీంతో ముగ్గురు యువ‌కులు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు విడిచారు. కాగా, ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నామని బెంగు‌ళూరులోని ఎల‌హంక పోలీసులు తెలిపారు.
(చదవండి: చాక్లెట్ మ్యాగీ: ఇదో విప‌త్తు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement