ఐఫోన్ కోసం యువతి ఇలా చేసిందేంటి? | Woman strips to her underwear and covers herself in car oil | Sakshi
Sakshi News home page

ఐఫోన్ కోసం యువతి ఇలా చేసిందేంటి?

Jun 11 2016 8:43 AM | Updated on Apr 3 2019 4:37 PM

ఐఫోన్ కోసం యువతి ఇలా చేసిందేంటి? - Sakshi

ఐఫోన్ కోసం యువతి ఇలా చేసిందేంటి?

స్మార్ట్ ఫోన్లు దైనందిన జీవితంలో భాగమైపోతున్నాయి. అందులోనూ బ్రాండెడ్ ఫోన్ల కోసం యువత ఏదైనా చేయడానికి సిద్ధమై పోతోంది.

మాస్కో: స్మార్ట్ ఫోన్లు దైనందిన జీవితంలో భాగమైపోతున్నాయి. అందులోనూ బ్రాండెడ్ ఫోన్ల కోసం యువత ఏదైనా చేయడానికి సిద్ధమై పోతోంది. రష్యాకు చెందిన బ్లాగర్ డిమిత్రి షిలోవ్ ఈ విషయాన్ని నిరూపించడానికి ఓ ప్రయోగం చేశాడు. సెంట్రల్ రష్యాలోని పలు ప్రాంతాల్లో కొందరు యువతులను కలిశాడు. ఇందులో భాగంగా అతడు తన ఇద్దరు స్నేహితుల సాయం కోరాడు. ఈ ముగ్గురు కలిసి నగర వీదుల్లో యువతులను కలిసి స్మార్ట్ ఫోన్ల కోసం ఏం చేస్తారంటూ ప్రశ్నించాడు. కొందరు మేం ఏం చేయడానికైనా వెనుకాడమని చెప్పగా, మరికొందరు శృంగారం తప్ప ఎలాంటి పని అయినా చేస్తామంటూ బదులిచ్చారు. వారి పాత మొబైల్ ను ఎక్స్ చేంజ్ చేసుకుని కొత్త ఐఫోన్ ఎస్ ఇస్తామని చెప్పారు.

కేసేనియా అనే యువతి ఐఫోన్ కోసం ఏం కండీషన్ పెట్టినా చేయడానికి ఒప్పుకుంది. ఈ విషయాన్ని వీడియోగా చిత్రీస్తామని ఆమెకు చెప్పారు. ఐఫోన్ చాలెంజ్ లో నెగ్గాలని భావించిన యువతి కేసేనియా, ఆ ముగ్గురితో కలిసి ఓ ప్రాంతానికి వెళ్లింది. వారు చెప్పినట్లుగా తన డ్రెస్ మొత్తం విప్పేసింది. కేవలం లో దుస్తులతో కారును ఆనుకుని ఫోజులిచ్చింది. లోదుస్తులతో ఉన్న కేసేనియాను తన ఒంటిపై ఇంజిన్ ఆయిల్ పోసుకుని కాసేపు ఉండాలని చెప్పగా, ఆ పని కూడా చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో ఇంటర్నెట్ లో హల్ చేస్తోంది. దీంతో ఒక్క వీడియోతో కేసేనియా పాపులర్ అవడంతో పాటు తీవ్ర విమర్శలకు గురైంది. మొబైల్ కోసం ఆడపిల్లలు ఇలాంటి చేష్టలు చేస్తారా అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement