iPhone 5s
-
ఆ ఐఫోన్ ధర కేవలం రూ.1,699
కొత్త ఐఫోన్ల లాంచింగ్‌తో పాటు పాత ఐఫోన్ల ధరలన్నీ కిందకి దిగొచ్చిన సంగతి తెలిసిందే. పాత ఐఫోన్లపై ఆపిల్ భారీగా ధరలు తగ్గించింది. ఆపిల్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్ కూడా పాత ఐఫోన్లపై బాగానే ధరల తగ్గింపును చేపట్టింది. అయితే ఈ తగ్గింపును ఎక్స్చేంజ్లో అందిస్తోంది. తాజాగా ఐఫోన్ 5ఎస్‌ను కేవలం రూ.1,699కే అందుబాటులోకి తీసుకొచ్చింది. అసలు ఈ ఐఫోన్ 5ఎస్ ధర 25వేల రూపాయలు. 32 శాతం తగ్గింపుతో ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ 16,999 రూపాయలకు లిస్టు అయింది. అంతేకాక ఈ ఫోన్‌ను ఎక్స్చేంజ్లో కొనుగోలు చేస్తే, 15,300 రూపాయల వరకు తగ్గింపు అందిస్తోంది. అంటే చివరకు ఈ ఫోన్ రూ.1,699కు అందుబాటులో ఉంది. అయితే ఈ ఫోన్‌నూ ఏదైనా ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌తో ఎక్స్చేంజ్ చేసుకోవాలట. అచ్చం ఇలాంటి ఆఫర్‌నే ఐఫోన్ 6, ఐఫోన్ 6 ఎస్ స్మార్ట్ఫోన్లపై కూడా ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది. రూ.25,999 రూపాయలు కలిగిన ఐఫోన్ 6ను ఎక్స్చేంజ్లో కొనుగోలు చేస్తే, 20వేల రూపాయల వరకు తగ్గింపును ఇస్తోంది. దీంతో ఈ ఫోన్ కూడా రూ.5,999కే అందుబాటులోకి వచ్చింది. కానీ ఏదైనా ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌తో వీటిని ఎక్స్చేంజ్ చేసుకోవడమే కాస్త హాస్యాస్పందంగా ఉందని పలువురంటున్నారు. -
టాప్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్.. ‘ఐఫోన్ 5ఎస్’
న్యూఢిల్లీ: భారత్‌లో టాప్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌గా యాపిల్ ‘ఐఫోన్ 5ఎస్’ అవతరించింది. ఢిల్లీ, గుజరాత్, కర్నాటక, మహరాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలో ఐఫోన్–5ఎస్ టాప్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌గా కొనసాగుతోంది. దీని తర్వాతి స్థానాన్ని ఐఫోన్ 6 కైవసం చేసుకుంది. పశ్చిమ బెంగాల్‌ను మినహాయిస్తే శాంసంగ్ ఎస్4 మిని ఫోన్ ప్రీమియం కేటగిరిలో రెండో అత్యంత ఇష్టమైన స్మార్ట్‌ఫోన్‌గా ఉంది. ఢిల్లీ, గుజరాత్లో ఐఫోన్ 7 ఐదో స్థానాన్ని దక్కించుకుంది. కర్నాటకలో వన్‌ప్లస్ 3టీ 4వ స్థానంలో నిలిచింది. మొబిలిటిక్స్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వన్‌ప్లస్ 3టీ అతి తక్కువ కాలంలో టాప్–5లో స్థానం దక్కించుకోవడం ఆశ్చర్యకరంగా ఉందని నివేదిక పేర్కొంటోంది. ఓపో, వివో బ్రాండ్ విక్రయాలు కూడా బాగున్నాయని కానీ జాబితాలో స్థానంలో పొందలేకపోయాయని తెలిపింది. -
ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఐఫోన్ రూ.1999లే
ఆన్ లైన్ రీటైలర్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ మరోసారి ఐఫోన్ మోడల్స్‌పై భారీ ఎక్స్చేంజ్ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్ల కింద కేవలం రూ.1999కే ఐఫోన్‌ను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.17,999 రూపాయలుగా ఉన్న ఐఫోన్ 5 ఎస్ (16 జీబీ వేరియంట్-సిల్వర్, స్పేస్ గ్రే)పై ఫ్లిప్ కార్ట్ 16 వేల రూపాయల భారీ ఎక్స్చేంజ్ డిస్కౌంట్‌ను అందిస్తున్నట్టు పేర్కొంది. ఆ ఆఫర్ వల్ల రూ.1999కే ఐఫోన్ 5 ఎస్ ఫ్లిప్ కార్ట్ లో లభ్యం కానుంది. ఈ ఎక్స్చేంజ్ ఆఫర్లు ఐఫోన్ 6 ఎస్ (32 జీబీ వేరియంట్ - రోజ్ గోల్డ్)లకు కూడా వర్తిస్తాయని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఈ ఫోన్ ప్రస్తుతం లిస్టెడ్ ధర రూ.40,999గా ఉండగా, దానిపై ఫ్లిప్ కార్ట్ 16 వేల రూపాయల ఎక్స్చేంజ్ ఆఫర్ ను ప్రకటించింది. ఇలావుండగా, గతేడాది లాంచ్ చేసిన ఐఫోన్ 7 (32 జీబీ వేరియంట్ - సిల్వర్, రోజ్ గోల్డ్, గోల్డ్)ను కూడా ఎక్సేంజ్ ఆఫర్ లో తక్కువగా 37 వేల రూపాయలకే అందుబాటులో ఉండనుంది. ఐఫోన్ 7 అసలు ధర 57 వేల రూపాయలు. దాంతో పాటు ఐఫోన్ 7 ప్లస్ ను కూడా ఎక్సేంజ్ ఆఫర్ లో అందించనుంది. బేస్ ధర రూ.68,4000 గా ఉన్న ఈ ఫోను ఎక్స్చేంజ్ ఆఫర్ లో 48,4000 రూపాయలకు లభిస్తుంది. ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్‌ల (128 జీబీ, 256 జీబీ వేరియంట్లపై) 20 వేల రూపాయల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంచుతున్నట్టు ఫ్లిప్ కార్ట్ పేర్కొంది. గూగుల్ స్మార్ట్ ఫోన్లపై కూడా ఫ్లిప్ కార్ట్ ఎక్స్చేంజ్ ఆఫర్లను అందించనున్నట్టు తెలిపింది. గూగుల్ పిక్సెల్, గూగుల్ పిక్సెల్ ఎక్స్ ఎల్ స్మార్ట్ ఫోన్లపై రూ.16వేల వరకు ధర తగ్గించనున్నట్టు పేర్కొంది. అయితే ఏ ఫోన్ల ఎక్స్చేంజ్తో ఐఫోన్ల ధర తగ్గించనుందో ఫ్లిప్ కార్ట్ వెల్లడించలేదు. -
వాలెంటైన్స్ డేకి కంపెనీలు స్పెషల్ ఆఫర్లు
వాలెంటైన్స్ డే సందర్భంగా ఆన్లైన్ మార్కెట్ సంస్థలు, ప్రొడక్ట్ కంపెనీలు బంపర్ ఆఫర్లతో వినియోగదారులు ముందుకొచ్చాయి. ఆపిల్, మోటోరోలా, శాంసంగ్, అమెజాన్ వంటి కంపెనీలు క్యాష్ బ్యాక్, ఉచిత మూవీ టిక్కెట్ ఆఫర్లతో వినియోగదారులను మురిపిస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీతో జతకట్టిన ఆపిల్, ఐఫోన్ 5ఎస్ స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఐఫోన్ 5ఎస్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ.6000 క్యాష్‌బ్యాక్‌ను అందించనున్నట్టు తెలిపింది. ఈ క్యాష్ బ్యాక్ కస్టమర్ అకౌంట్లోకి అదేరోజు లేదా కొనుగోలు చేసిన 90రోజుల్లో క్రెడిట్ కానున్నాయి. అయితే ఈ ఆఫర్ కేవలం ఫిబ్రవరి 14 వరకే అందుబాటులో ఉండనుంది. తర్వాత ఐఫోన్ 5ఎస్ కొనుగోలు చేసిన వారికి ఇది వర్తించదు. కేవలం హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులపైనే కాకుండా మిగతా బ్యాంకు కార్డులపై కూడా ఆపిల్ క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది. అయితే మిగతా బ్యాంకు కార్డుదారులకు రూ.2000లనే ఆఫర్ చేయనుంది. ఈ బ్యాంకుల్లో అమెరికన్ ఎక్స్‌ప్రెస్, యాక్సిస్ బ్యాంకు, సిటీ బ్యాంకు, హెచ్ఎస్బీసీ, ఐసీఐసీఐ, ఇండస్ఇండ్ బ్యాంకు, కొటక్ మహింద్రా బ్యాంకు, ఆర్బీఎల్ బ్యాంకు, స్టాండర్డ్ ఛార్టెడ్, ఎస్బీఐ, యూనియన్ బ్యాంకు, యస్ బ్యాంకులు దీనిలో ఉన్నాయి. వాలెంటైన్స్ డే సందర్భంగా మరో స్మార్ట్‌ఫోన్ కంపెనీ మోటోరోలా తన ప్రొడక్ట్లన్నింటిపై కపుల్ పీవీఆర్ టిక్కెట్లను అందిస్తోంది. మోటో జెడ్, మోటో జెడ్ ప్లే, మోటో మోడ్స్, మోటో ఎం, మోటో జే4 ప్లే, మోటో ఈ3 పవర్, మోటో ఎక్స్ ఫోర్స్‌లను ఫిబ్రవరి 14కు ముందు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఇతర రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేస్తే ఈ టిక్కెట్లను పొందవచ్చు. లీ ఎకో కూడా మరో సేల్‌ను ప్రకటించింది. సోమవారం నుంచి బుధవారం మధ్యలో లీమాల్.కామ్‌లో తమ స్మార్ట్‌టీవీ సూపర్3 ఎక్స్55 ఆల్ట్రా హెచ్డీవీని కొనుగోలు చేసిన వారికి అన్ని డెబిల్, క్రెడిట్ కార్డులపై రూ.4000 క్యాష్ బ్యాక్ అందించనున్నట్టు తెలిపింది. మరో రూ.1500 నగదు బహుమతిని గెలుచుకునే ఆఫర్ ను అందిస్తోంది. -
ఐఫోన్ కోసం యువతి ఇలా చేసిందేంటి?
మాస్కో: స్మార్ట్ ఫోన్లు దైనందిన జీవితంలో భాగమైపోతున్నాయి. అందులోనూ బ్రాండెడ్ ఫోన్ల కోసం యువత ఏదైనా చేయడానికి సిద్ధమై పోతోంది. రష్యాకు చెందిన బ్లాగర్ డిమిత్రి షిలోవ్ ఈ విషయాన్ని నిరూపించడానికి ఓ ప్రయోగం చేశాడు. సెంట్రల్ రష్యాలోని పలు ప్రాంతాల్లో కొందరు యువతులను కలిశాడు. ఇందులో భాగంగా అతడు తన ఇద్దరు స్నేహితుల సాయం కోరాడు. ఈ ముగ్గురు కలిసి నగర వీదుల్లో యువతులను కలిసి స్మార్ట్ ఫోన్ల కోసం ఏం చేస్తారంటూ ప్రశ్నించాడు. కొందరు మేం ఏం చేయడానికైనా వెనుకాడమని చెప్పగా, మరికొందరు శృంగారం తప్ప ఎలాంటి పని అయినా చేస్తామంటూ బదులిచ్చారు. వారి పాత మొబైల్ ను ఎక్స్ చేంజ్ చేసుకుని కొత్త ఐఫోన్ ఎస్ ఇస్తామని చెప్పారు. కేసేనియా అనే యువతి ఐఫోన్ కోసం ఏం కండీషన్ పెట్టినా చేయడానికి ఒప్పుకుంది. ఈ విషయాన్ని వీడియోగా చిత్రీస్తామని ఆమెకు చెప్పారు. ఐఫోన్ చాలెంజ్ లో నెగ్గాలని భావించిన యువతి కేసేనియా, ఆ ముగ్గురితో కలిసి ఓ ప్రాంతానికి వెళ్లింది. వారు చెప్పినట్లుగా తన డ్రెస్ మొత్తం విప్పేసింది. కేవలం లో దుస్తులతో కారును ఆనుకుని ఫోజులిచ్చింది. లోదుస్తులతో ఉన్న కేసేనియాను తన ఒంటిపై ఇంజిన్ ఆయిల్ పోసుకుని కాసేపు ఉండాలని చెప్పగా, ఆ పని కూడా చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో ఇంటర్నెట్ లో హల్ చేస్తోంది. దీంతో ఒక్క వీడియోతో కేసేనియా పాపులర్ అవడంతో పాటు తీవ్ర విమర్శలకు గురైంది. మొబైల్ కోసం ఆడపిల్లలు ఇలాంటి చేష్టలు చేస్తారా అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఐఫోన్ ఎస్ఈ కొనే వాళ్లు ఆగండి..
యాపిల్ తాజాగా ఆవిష్కరించిన ఐఫోన్ ఎస్ఈ కొనాలనుకుంటున్నారా? అయితే కొన్ని నెలలు ఆగాల్సిందే అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. ఎందుకంటే ఐఫోన్ ఎస్ఈ ధర తగ్గుతుందంట. ప్ర్తస్తుతం భారత మార్కెట్లో రూ.39 వేలుగా ఉన్న దీని ధర రూ. 30 వేలకు పడిపోయే అవకాశాలున్నాయని చెబుతున్నారు. సాధారణ వినియోగదారులకు అందుబాటులో ఉండేట్టు ఈ ఫోన్ ధర తగ్గించనున్నట్టు తెలుస్తోంది. ఐఫోన్ 5ఎస్ భారత్ మార్కెట్లో మంచి డిమాండ్ పలకడం, ఐఫోన్ ఎస్ఈకి ధర తగ్గుదలకు ఆటంకంగా మారింది. 2015 చివరి క్వార్టర్ లో ఈ ఐఫోన్ 5ఎస్ లను కంపెనీ ఎక్కువగా దిగుమతి చేసుకుంది. ఈ స్టాక్ అమ్ముడుపోయే వరకు ఐఫోన్ ఎస్ఈ ధర రూ.39 వేలగానే ఉంచేందుకు కంపెనీ నిర్ణయించింది. ఒకవేళ ఇప్పుడే ఐఫోన్ ఎస్ఈ ధర తగ్గిస్తే 5ఎస్ అమ్మకాలు పడిపోయే అవకాశాలు ఉండటంతో, ఐఫోన్ ఎస్ఈ ధర తగ్గింపుకు మరికొన్ని నెలలు ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాని కొన్ని నెలల్లోనే యాపిల్ కచ్చితంగా ఐఫోన్ ఎస్ఈ ధరను తగ్గిస్తుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అదేవిధంగా క్యాష్ బ్యాక్, ఈఎంఐ ఆఫర్లను కూడా ఐఫోన్ ఎస్ఈకి యాపిల్ కల్పించనుంది. ఐఫోన్ ఎస్ఈకు ముందు మార్కెట్లోకి వచ్చిన 16జీబీ ఐఫోన్ 6ఎస్ ధర కూడా కొన్ని నెలల్లోనే రూ.62 వేల నుంచి రూ.42 లకు పడిపోయింది. ఇదే విధంగా కొత్తగా మార్కెట్లో ఆవిష్కరించిన ఐఫోన్ ఎస్ఈ ధరను కూడా యాపిల్ తగ్గిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మార్కెట్లో అందుబాటులో ఉన్న ఐఫోన్ 6ఎస్ కు, ఎస్ఈకి పెద్ద తేడాలు ఏమీ లేవని, ఒకే విధమైన ఫీచర్స్ ను ఈ ఫోన్లు కలిగి ఉన్నాయంటున్నారు. -
ఐఫోన్ 5ఎస్ మరింత ఇంప్రూవ్ అవుతోంది!
న్యూయార్క్: యాపిల్ ఐఫోన్-5 ఎస్ మరిన్ని మెరుగులు దిద్దుకుంటోంది. ఐఫోన్-6లో ఉన్న స్పెషల్ ఫీచర్లను 5ఎస్‌లోనూ అమర్చాలని యాపిల్ కంపెనీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. 5ఎస్ తరహాలో నాలుగు అంగుళాల పొడవు ఉన్న కొత్త ఐఫోన్‌ను వచ్చే మార్చి నెలలో మార్కెట్లో ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఇందులో 8 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమరా, 1.2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ఆపిల్ ప్లే యాప్ పనిచేసేవిధంగా ఎన్ఎఫ్సీ చిప్, ఏ 8 ప్రాసెసర్‌తోపాటు కనెక్టివీటికి సంబంధించి వై-ఫై వంటి ఫీచర్లు మరింత మెరుగవ్వనున్నాయని 'వర్జ్' మీడియా సంస్థ తెలిపింది. దీంతోపాటు ఈ ఫోన్లో స్వల్పంగా డిజైన్ మార్పులు కూడా ఉంటాయని యాపిల్ తెలిపిందని అది పేర్కొంది. దీనిని ఐఫోన్-5ఎస్ఈగా పిలిచే అవకాశముంది. లైవ్ ఫోటో ఫీచర్‌ను సపోర్ట్ చేసే ఈ మోడల్ మార్చి నెలలో మార్కెట్లోకి వచ్చే అవకాశముంది. దీనితోపాటు కొత్త వెర్షన్ యాపిల్ వాచ్‌లను కూడా విడుదల కానున్నాయి. -
ఐఫోన్‌తో.. టూరు ఖర్చు రాబట్టేయొచ్చు!
పురుషులందు పుణ్య పురుషులు వేరయా... అన్నట్లు సెల్ఫోన్లలో ఆపిల్ ఐఫోన్లు వేరయా అనాల్సిందే. మైండ్ బ్లాకయ్యే ఫీచర్లతో పాటు నాజూగ్గా ఉండే ఐఫోన్‌ను ఇష్టపడని వారెవరు చెప్పండి! ఇక, బంగారు రంగులో మిలమిలలాడే ఐఫోన్ 5ఎస్ చూసి ప్రపంచమంతా ఫ్లాటైపోతోంది. దాన్ని చేజిక్కించుకోవడానికి తహతహలాడుతోంది. ఇతర దేశాలతో పోలిస్తే... అమెరికాలో ఐఫోన్ ధరలు తక్కువ. ఐఫోన్ 5ఎస్ (32 జీబీ) ధర అక్కడ అన్ని పన్నులతో కలిపి 815 డాలర్లు. అదే ఇటలీలో అయితే 1,130 డాలర్లు! ఐఫోన్లు ప్రపంచంలో ఎక్కడైనా హాట్‌కేకుల్లా అమ్ముడవుతాయి. అందుకే, ఇతర దేశాల వారు అమెరికా వెళ్లినపుడు వీటిని సాధ్యమైనన్ని ఎక్కువ కొంటున్నారు. తమ దేశానికి తిరిగి వెళ్లినపుడు వాటిని విక్రయించడం ద్వారా అమెరికా టూరుకు అయిన ఖర్చును తిరిగి సంపాదిస్తున్నారు. కొందరైతే లాభాలు జేబులో వేసుకుంటున్నారు కూడా. లాభానికి అమ్ముకోవడం కోసం ఫోన్లను కొనడానికి వచ్చే వారితో అమెరికాలోని ఐఫోన్ స్టోర్లు కిటకిటలాడుతున్నాయి. ఒక ఐఫోన్ ఇవ్వండి అంటూ కొనుగోలుదారులు అడగ్గానే ఒకటి చాలా అని షాపు వాళ్లు అడగడం పరిపాటిగా మారింది. ఎందుకంటే, ఐఫోన్ స్టోర్లకు వచ్చే వారు రెండు, మూడు ఫోన్లను కొంటున్నారు మరి. అంతకంటే ఎక్కువ సంఖ్యలో కొనేవారూ ఉన్నారు. ముఖ్యంగా గోల్డ్ మోడల్‌ను అధికంగా కొనుగోలు చేస్తున్నారు. ఎందుకంటే, ఈ మోడల్‌కు యూరప్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది. క్షణాల్లో రీసేల్ అయిపోతుంది! డాలర్, యూరోల మాదిరిగానే ఐఫోన్ కూడా అంతర్జాతీయ కరెన్సీకి ఓ రూపంగా మారిందనడంలో అతిశయోక్తి లేదు. అక్కడ కొనడం... లాభానికి అమ్మడం ... విదేశీ పర్యటనలకు వెళ్లేవారు అక్కడ చౌకగా దొరికే వస్తువులు కొని తమ దేశంలో అమ్ముకోవడం ఎప్పటినుంచో జరుగుతున్నదే. ఆసియా దేశాల వారు గతంలో ప్యారిస్‌లో తక్కువ ధరకు లభించిన లూయిస్ వ్యూటన్, గుచ్చి హ్యాండ్‌బ్యాగులు కొని తమ దేశంలో అధిక రేటుకు విక్రయించే వారు. తూర్పు యూరప్‌లో ఉండే అమెరికన్లకు 1990వ దశకంలో లివైస్ జీన్స్ ఈ తరహా ఆర్థిక వెసులుబాటు కల్పించేవి. ఇప్పుడు ఐఫోన్లు... ముఖ్యంగా గోల్డ్ 5ఎస్ హవా నడుస్తోంది. రెండు ఫోన్లతో పర్యటన ఖర్చు వచ్చినట్లే... ఐఫోన్ 5ఎస్ గతేడాది లండన్‌లో విడుదలైంది. అప్పటికింకా భారతీయ మార్కెట్లోకి ప్రవేశించలేదు. నాడు లండన్ వెళ్లిన భారతీయులు ఐఫోన్ స్టోర్లకు ఎగబడే వారు. రెండు ఫోన్లు కొని ఇండియాలో వాటిని అమ్మితే చాలు, లండన్ పోను, రాను ఖర్చులు గిట్టుబాటయ్యేవి. ఐఫోన్లు ఒక దేశం నుంచి మరో దేశానికి తరలడం తమ కంపెనీ లాభాలు పెరగడంలో ముఖ్యపాత్ర పోషిస్తుందని ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ అంటున్నారు. జూలై క్వార్టర్లో చైనాలో ఆపిల్ ఆదాయం 14 శాతం క్షీణించడానికి హాంకాంగ్‌లో క్రయవిక్రయాలు మందగించడమే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికాలో చౌక... ఐఫోన్ 5ఎస్ (16 జీబీ) అమెరికాలో చౌకగా 700 డాలర్లకు దొరుకుతోంది. ఇదే మోడల్‌ను బ్రెజిల్లో కొనాలంటే 1,200 డాలర్లు, ఇటలీలో అయితే వెయ్యి డాలర్లు వదిలించుకోవాల్సిందే. -
భారత్ మార్కెట్లోకి యాపిల్ ఐఫోన్ 5ఎస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గ్రే మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 5ఎస్ గోల్డ్ కలర్ మోడల్ హవా నడుస్తోంది. ఎంతగా అంటే.. రూ.53,500 ఖరీదున్న ఫోన్‌ను రూ.1.2 లక్షలు వెచ్చించడమేకాదు, అదీ భారత్‌లో విడుదల కాకముందే చేజిక్కించుకునేంతగా. దీనికంతటికీ కారణమేమంటే ఆపిల్ తొలిసారిగా బంగారు వర్ణంలో ఐఫోన్ 5ఎస్‌ను పరిచయం చేయడమే. సహజంగానే ఆపిల్ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంటుంది. అందరూ ఈ కలర్ ఫోన్‌కే ఎగబడడంతో కొరత ఏర్పడింది. ఇంకేముంది గోల్డ్ మేనియాకు పెట్టింది పేరైన మన దేశంలోనూ డిమాండ్ ఊహించనంతగా ఉంది. దీంతో రెండింతల ధర వెచ్చించేందుకూ ఐఫోన్ అభిమానులు వెనుకాడడం లేదు. అంతర్జాతీయంగా నెలన్నర క్రితం కొత్త మోడళ్లు విడుదలయ్యాయి. విడుదలైన మూడు రోజులకే గ్రే మార్కెట్లో ఉత్తరాదికి చెందిన ఒక కస్టమర్ రూ.1.2 లక్షలు వెచ్చించి గోల్డ్ కలర్ ఫోన్‌ను కైవసం చేసుకున్నాడట. సిమెంటు వ్యాపారంలో ఉన్న హైదరాబాద్ యువ వ్యాపారి ఒకరు రూ.1 లక్ష చెల్లించినట్టు సమాచారం. సరఫరా 200 పీసులే..: ఆపిల్ భారత్‌లో అధికారికంగా నవంబర్ 1న ఐఫోన్ 5ఎస్, 5సీ మోడళ్లను దేశవ్యాప్తంగా విడుదల చేసింది. ఐఫోన్ 5ఎస్ ధర 16 జీబీ మోడల్ రూ.53,500, 32 జీబీ రూ.62,500, 64 జీబీ రూ.71,500 ఉంది. అలాగే ఐఫోన్ 5సీ 16 జీబీ రూ.41,900 కాగా, 32 జీబీ రూ.53,500గా నిర్ణయించింది. గోల్డ్, సిల్వర్(వైట్), స్పేస్ గ్రే(బ్లాక్) రంగుల్లో ఐఫోన్ 5ఎస్ రూపొందింది. బ్లూ, గ్రీన్, పింక్, యెల్లో, వైట్ రంగుల్లో ఐఫోన్ 5సీ లభిస్తోంది. వైట్ మినహా మిగిలిన రంగులన్నీ ఆపిల్ తొలిసారిగా విడుదల చేసినవే. అయితే భారత్‌కు సరఫరా అయిన గోల్డ్ కలర్ 5ఎస్ ఫోన్ల సంఖ్య 200 మాత్రమేనని విశ్వసనీయ సమాచారం. ఐఫోన్ కొత్త మోడళ్ల డిమాండ్ ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 10 వేల పీసులుంటుందని ఒక రిటైలర్ తెలిపారు. 30 శాతం మంది గోల్డ్ కలర్‌నే కోరుకుంటున్నారు. ఆ తర్వాతి స్థానం స్పేస్ గ్రే(బ్లాక్), సిల్వర్(వైట్) రంగులది. ఆర్‌కాం ప్రత్యేక ఆఫర్..: రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కాం) ఐఫోన్ కస్టమర్ల కోసం నెలవారీ వాయిదా పథకాన్ని ప్రకటించింది. కాల పరిమితి 24 నెలలు. లోకల్, ఎస్టీడీ కాల్స్, ఎస్ఎంఎస్ అపరిమితం. నేషనల్ రోమింగ్ ఉచితం. 3జీ డేటా అపరిమితంగా వినియోగించుకోవచ్చు. 16 జీబీ ఐఫోన్ 5సీ, 5ఎస్‌ను ఎలాంటి డౌన్ పేమెంట్ లేకుండా అందిస్తోంది. నెలవారీ వాయిదా 5సీ మోడళ్లు అయితే రూ.2,599, 5ఎస్ మోడళ్లు రూ.2,999. -
ఈ ఐఫోన్ ‘బంగారం’..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బంగారమే కాదు బంగారు వర్ణానికీ ఎవరైనా దాసోహం కావాల్సిందే. గోల్డ్మేనియా భారత్‌తోపాటు ప్రపంచ దేశాలకూ వ్యాపించిందని చెప్పడానికి ఆపిల్ ఐఫోన్ 5ఎస్ ఉదాహరణ. ఆపిల్ కంపెనీ తొలిసారిగా బంగారు రంగులో ఐఫోన్ 5ఎస్‌ను రూపొందించింది. చూడగానే ఇట్టే హత్తుకునేలా ఉన్న ఈ ఫోన్ కోసం పలు దేశాల్లో కస్టమర్లు ఎగబడుతున్నారు. ఇంకేముంది సహజంగానే కొరత ఏర్పడింది. ప్రీమియం చెల్లించైనా సరే కొందరు కస్టమర్లు దీనిని చేజిక్కించుకున్నారు. భారత్‌లోనూ ఈ పరిస్థితి రావడం ఖాయమని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ప్రీమియం రూ.20 వేల దాకా వెళ్లొచ్చని ఒక రిటైలర్ వ్యాఖ్యానించారు. కాగా, ఆపిల్ ఎట్టకేలకు భారత్‌లో ఐఫోన్ 5ఎస్, ఐఫోన్ 5సీ ధరలను ప్రకటించింది. ఐఫోన్ 5ఎస్ 16 జీబీ మోడల్ రూ.53,500, 32 జీబీ రూ.62,500, 64 జీబీ రూ.71,500గా నిర్ణయించింది. అలాగే ఐఫోన్ 5సీ 16 జీబీ మోడల్ ధర రూ.41,900 కాగా, 32 జీబీ రూ.53,500 ఉంది. నవంబరు 1 నుంచి ఇవి రిటైల్ మార్కెట్లో లభిస్తాయి. తొలిసారిగా కొత్త రంగుల్లో.. గోల్డ్, సిల్వర్(వైట్), స్పేస్ గ్రే(బ్లాక్) రంగుల్లో ఐఫోన్ 5ఎస్‌ను రూపొందించారు. బ్లూ, గ్రీన్, పింక్, యెల్లో, వైట్ రంగుల్లో ఐఫోన్ 5సీ లభిస్తోంది. వైట్ మినహా మిగిలినవన్నీ ఆపిల్ తొలిసారిగా విడుదల చేసిన రంగులే. 5ఎస్‌లో బంగారు వర్ణంతోపాటు స్పేస్ గ్రే(బ్లాక్) మోడల్‌ను కూడా కస్టమర్లు ఎక్కువగా ఎంచుకుంటున్నారు. వైట్ ఎప్పటికీ రాయల్ కలర్ అని ఒక రిటైల్ కంపెనీ ప్రతినిధి అన్నారు. 5సీ రంగులకు మహిళలు ఎక్కువగా ఆకర్షితులవుతారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో నెలకు 5-6 వేలు.. ఆంధ్రప్రదేశ్‌లో నెలకు 5 నుంచి 6 వేల ఐఫోన్లు అమ్ముడవుతున్నాయి. ఆపిల్ ఉత్పత్తులకు ఇక్కడ మంచి డిమాండ్ ఉంది. భారత్‌లో ఆవిష్కరణ కాకముందే విదేశాల నుంచి తెప్పించుకునే వారూ ఉన్నారని మొబైల్ ఫోన్ల విక్రయ సంస్థ టెక్నోవిజన్ ఎండీ సికందర్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 4 లక్షల ఐఫోన్లు అమ్ముడైనట్లు ఒక అంచనా. 5ఎస్, 5సీ కోసం తమ ఔట్లెట్లలో 200 పైగా ప్రీ బుకింగ్స్ నమోదయ్యాయని పేర్కొన్నారు. ఇక ఐఫోన్ కొత్త మోడల్స్ కోసం 500 మందికిపైగా బిగ్-సి వెబ్సైట్లో రిక్వెస్ట్ చేసినట్టు ఆ కంపెనీ ప్రతినిధి తెలిపారు. 200 మంది నగదు చెల్లించారని అన్నారు. ఫోన్ల కోసం 250 రిక్వెస్టులు వచ్చాయని, 50 మంది నగదు చెల్లించారని లాట్ మొబైల్స్ ప్రతినిధి చెప్పారు. కాగా, భారతి ఎయిర్టెల్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఔట్‌లెట్లలోనూ 5ఎస్, 5సీ లభిస్తాయి. -
డిసెంబర్ కల్లా యాపిల్ చౌక ఐఫోన్
-
డిసెంబర్ కల్లా యాపిల్ చౌక ఐఫోన్
స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లో పూర్వ వైభవం పొందడం, కొత్త మార్కెట్లకు విస్తరించడం లక్ష్యాలుగా యాపిల్ కంపెనీ కొత్త ఐఫోన్లను ఆవిష్కరించింది. భారత్, చైనాల్లో చౌక ధరల స్మార్ట్ఫోన్లు బాగా అమ్ముడవుతుండటంతో, శామ్సంగ్, ఇతర దేశీయ కంపెనీల స్మార్ట్ఫోన్లకు పోటీగా యాపిల్ కంపెనీ ఐఫోన్ 5సీని మార్కెట్లోకి తెచ్చింది. పసుపు, ఆకుపచ్చ, నీలం, తెలుపు, ఎరుపు రంగుల్లో లభ్యమయ్యే ఈ ఫోన్ ధరలను (రెండేళ్ల పాటు మొబైల్ ఆపరేటర్లతో కాంట్రాక్ట్‌తో) 16జీబీ 99 డాలర్లు, 32 జీబీ 199 డాలర్లుగా కంపెనీ నిర్ణయించింది. మల్టీ టచ్ ఇంటర్ఫేస్తో లభ్యమయ్యే ఈ ఫోన్లో 4 అంగుళాల రెటినా డిస్ప్లే, ఫుల్ ఎస్ఆర్జీబీ, ఏ6 పవర్ ప్రాసెసర్, 8 మెగా పిక్సెల్ ఐసైట్ కెమెరా వంటి ఫీచర్లున్నాయి. ఇక టాప్ఎండ్ మోడల్, యాపిల్ ఐఫోన్ 5 ఎస్‌ను హై గ్రేడ్ అల్యూమినియంతో తయారు చేశారు. మూడు వెర్షన్లలో లభించే వీటి ధరలను 199 డాలర్లు(16జీబీ), 299 డాలర్లు(32జీబీ), 399 డాలర్లు(64జీబీ)గా కంపెనీ నిర్ణయించింది. ఏ7(ఏ-64 బిట్) చిప్, యాక్సిలరో మీటర్, గైరోస్కోప్, కాంపాస్ సపోర్ట్, ఎం7(మోషన్ కో-ప్రాసెసర్) వంటి ప్రత్యేకతలున్నాయి. 10 గంటల 3జీ టాక్‌టైమ్, 250 గంటల స్టాండ్‌బై, 10 గంటల ఎల్టీఈ బ్రౌజింగ్, 40 గంటల మ్యూజిక్ ప్లే బాక్నిచ్చే బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ వంటి ప్రత్యేకతలున్నాయి. ఈ రెండు కొత్త ఫోన్లు ఈ ఏడాది డిసెంబర్ కల్లా భారత్‌లో లభ్యమవుతాయి. -
ఐఫోన్ 5ఎస్ నేడే విడుదల
ఐఫోన్‌తో మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్న యాపిల్ సంస్థ మరో కొత్త మోడల్ ఫోన్‌ను నేడు విడుదల చేయనుంది. స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌కు మార్కెట్ విస్తృతంగా పెరుగుతుండటంతో దాన్ని చేజిక్కించుకునే ప్రయత్నాలు చేస్తోంది. సిలికాన్ వ్యాలీలోని యాపిల్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం కొత్త 5ఎస్ మోడల్ విడుదల కానుంది. ఇది చూడటానికి ఇంతకు ముందు మోడళ్లలాగే ఉండొచ్చు గానీ, సరికొత్త ప్రాసెసర్, కొత్త గ్రాఫిక్స్ సామర్థ్యాలతో మరింత వేగంగా పనిచేస్తుందని ఫారెస్టర్ విశ్లేషకుడు చార్లెస్ గోల్విన్ అంటున్నారు. అంతేకాదు, ఇంతకుముందు వాటి కంటే దీని ధర కూడా తక్కువట. చాలా రంగులలో కూడా ఇది రాబోతోంది. ముందుగా ఇది బంగారు రంగులో ఉండి, వేలిముద్రలను కూడా గుర్తించే సామర్థ్యం కలిగి ఉంటుంది. దీనివల్ల ఫోన్ పోయినా.. యజమాని తప్ప వేరెవ్వరూ దీన్ని ఉపయోగించలేరన్న మాట. ప్రధానంగా చైనాతో పాటు అభివృద్ధి చెందుతున్న ఇతర మార్కెట్లలో కొనుగోలు దారులు దీనిపై ఎక్కువ మోజు పడొచ్చని భావిస్తున్నారు. ఆండ్రాయిడ్ ఓఎస్ ఉన్న ఫోన్లకు ఇటీవలి కాలంలో డిమాండ్ బాగా పెరుగుతోంది. బీజింగ్‌లో బుధవారం మరో కార్యక్రమం జరుగుతుందని కూడా యాపిల్ సంస్థ తెలిపింది.