టాప్‌ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌.. ‘ఐఫోన్‌ 5ఎస్‌’ | Apple iPhone 5S tops the list of premium smartphones in India | Sakshi
Sakshi News home page

టాప్‌ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌.. ‘ఐఫోన్‌ 5ఎస్‌’

May 11 2017 3:17 AM | Updated on Sep 5 2017 10:51 AM

టాప్‌ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌.. ‘ఐఫోన్‌ 5ఎస్‌’

టాప్‌ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌.. ‘ఐఫోన్‌ 5ఎస్‌’

భారత్‌లో టాప్‌ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌గా యాపిల్‌ ‘ఐఫోన్‌ 5ఎస్‌’ అవతరించింది. ఢిల్లీ, గుజరాత్, కర్నాటక, మహరాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలో ఐఫోన్‌–5ఎస్‌

న్యూఢిల్లీ: భారత్‌లో టాప్‌ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌గా యాపిల్‌ ‘ఐఫోన్‌ 5ఎస్‌’ అవతరించింది. ఢిల్లీ, గుజరాత్, కర్నాటక, మహరాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలో ఐఫోన్‌–5ఎస్‌ టాప్‌ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌గా కొనసాగుతోంది. దీని తర్వాతి స్థానాన్ని ఐఫోన్‌ 6 కైవసం చేసుకుంది. పశ్చిమ బెంగాల్‌ను మినహాయిస్తే శాంసంగ్‌ ఎస్‌4 మిని ఫోన్‌ ప్రీమియం కేటగిరిలో రెండో అత్యంత ఇష్టమైన స్మార్ట్‌ఫోన్‌గా ఉంది.

ఢిల్లీ, గుజరాత్‌లో ఐఫోన్‌ 7 ఐదో స్థానాన్ని దక్కించుకుంది. కర్నాటకలో వన్‌ప్లస్‌ 3టీ 4వ స్థానంలో నిలిచింది. మొబిలిటిక్స్‌ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వన్‌ప్లస్‌ 3టీ అతి తక్కువ కాలంలో టాప్‌–5లో స్థానం దక్కించుకోవడం ఆశ్చర్యకరంగా ఉందని నివేదిక పేర్కొంటోంది. ఓపో, వివో బ్రాండ్‌ విక్రయాలు కూడా బాగున్నాయని కానీ జాబితాలో స్థానంలో పొందలేకపోయాయని తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement