ఆ ఐఫోన్‌ ధర కేవలం రూ.1,699 | Flipkart makes you an Apple iPhone owner in just Rs 1,699 | Sakshi
Sakshi News home page

ఆ ఐఫోన్‌ ధర కేవలం రూ.1,699

Sep 16 2017 7:55 PM | Updated on Aug 1 2018 3:40 PM

ఆ ఐఫోన్‌ ధర కేవలం రూ.1,699 - Sakshi

ఆ ఐఫోన్‌ ధర కేవలం రూ.1,699

కొత్త ఐఫోన్ల లాంచింగ్‌తో పాటు పాత ఐఫోన్ల ధరలన్నీ కిందకి దిగొచ్చిన సంగతి తెలిసిందే. పాత ఐఫోన్లపై ఆపిల్‌ భారీగా ధరలు తగ్గించింది.

కొత్త ఐఫోన్ల లాంచింగ్‌తో పాటు పాత ఐఫోన్ల ధరలన్నీ కిందకి దిగొచ్చిన సంగతి తెలిసిందే. పాత ఐఫోన్లపై ఆపిల్‌ భారీగా ధరలు తగ్గించింది. ఆపిల్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌ కూడా పాత ఐఫోన్లపై బాగానే ధరల తగ్గింపును చేపట్టింది. అయితే ఈ తగ్గింపును ఎక్స్చేంజ్‌లో అందిస్తోంది. తాజాగా ఐఫోన్‌ 5ఎస్‌ను కేవలం రూ.1,699కే అందుబాటులోకి తీసుకొచ్చింది. అసలు ఈ ఐఫోన్‌ 5ఎస్‌ ధర 25వేల రూపాయలు. 32 శాతం తగ్గింపుతో ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ 16,999 రూపాయలకు లిస్టు అయింది. అంతేకాక ఈ ఫోన్‌ను ఎక్స్చేంజ్‌లో కొనుగోలు చేస్తే, 15,300 రూపాయల వరకు తగ్గింపు అందిస్తోంది. అంటే చివరకు ఈ ఫోన్‌ రూ.1,699కు అందుబాటులో ఉంది.
 
అయితే ఈ ఫోన్‌నూ ఏదైనా ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌తో ఎక్స్చేంజ్‌ చేసుకోవాలట. అచ్చం ఇలాంటి ఆఫర్‌నే ఐఫోన్‌ 6, ఐఫోన్‌ 6 ఎస్‌ స్మార్ట్‌ఫోన్లపై కూడా ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌ చేస్తోంది. రూ.25,999 రూపాయలు కలిగిన ఐఫోన్‌ 6ను ఎక్స్చేంజ్‌లో కొనుగోలు చేస్తే, 20వేల రూపాయల వరకు తగ్గింపును ఇస్తోంది. దీంతో ఈ ఫోన్‌ కూడా రూ.5,999కే అందుబాటులోకి వచ్చింది. కానీ ఏదైనా ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌తో వీటిని ఎక్స్చేంజ్‌ చేసుకోవడమే కాస్త హాస్యాస్పందంగా ఉందని పలువురంటున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement