పెను విధ్వంసం సృష్టించిన ఏప్రిల్ 25 భూకంపం నుంచి కోలుకుంటూ పునర్నిర్మాణ చర్యల్లో తమ ప్రభుత్వం నిమగ్నమై ఉండటంతో..
తాజా భూకంపంపై నేపాల్ ప్రధాని
కఠ్మాండు: పెను విధ్వంసం సృష్టించిన ఏప్రిల్ 25 భూకంపం నుంచి కోలుకుంటూ పునర్నిర్మాణ చర్యల్లో తమ ప్రభుత్వం నిమగ్నమై ఉండటంతో.. తాజాగా మంగళవారం సంభవించిన భూకంపాన్ని ఎదుర్కోలేకపోయామని నేపాల్ ప్రధానమంత్రి సుశీల్ కొయిరాలా పేర్కొన్నారు. ‘‘మేం ఆదమరచి ఉండగా దెబ్బతీసింది’’ అని చెప్పారు. రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో నమోదైన తాజా భూకంపం ప్రభావాన్ని పరిశీలించేందుకు ఆయన గురువారం దోలఖా ప్రాంతంలో పర్యటించారు. కాగా, తాజా భూకంపంలో మృతుల సంఖ్య 110కి పెరిగింది.