
వాటికన్ సిటీ: 1960ల్లో క్యాథలిక్ చర్చిలో రెండవ వాటికన్ మండలి ద్వారా సమూల మార్పులు తీసుకొచ్చిన పోప్ ఆరవ పాల్‌ను సెయింట్‌గా గుర్తించి గౌరవించనున్నట్లు వాటికన్ బుధవారం ప్రకటించింది. శాన్ సాల్వడార్‌లో క్రైస్తవ ప్రధాన మతగురువుగా పనిచేస్తూ 1980ల్లో సామాజిక న్యాయం, ప్రజల అణచివేతలపై ప్రశ్నించి హత్యకు గురైన ఆస్కార్ రొమెరోకు కూడా సెయింట్‌హుడ్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై పోప్ ఫ్రాన్సిస్ మంగళవారమే సంతకం చేశారు.