
కేథలిక్ చర్చి, వలసలపై మాత్రం మాట్లాడుతా
మొట్టమొదటి ఇంటర్వ్యూలో పోప్ లియో వెల్లడి
రోమ్: అగ్రరాజ్యం అమెరికా రాజకీయాల్లో జోక్యం చేసుకునే ఉద్దేశం తనకు లేదని పోప్ లియో స్పష్టం చేశారు. అయితే, ఆ దేశంలో కేథలిక్ చర్చి, వలసలకు సంబంధించిన అంశాలపై మాత్రం మాట్లాడుతానన్నారు. అమెరికాకు చెందిన మొట్టమొదటి పోప్‌గా చరిత్ర సృష్టించిన లియో మొదటిసారిగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మతబోధకులపై లైంగిక వేధింపుల ఆరోపణలు, ఎల్జీబీటీక్యూ ప్లస్ కేథలిక్కులు, వాటికన్–చైనా సంబంధాలు సహా పలు అంశాలపై మాట్లాడారు.
వాటికన్ కరస్పాండెంట్ ఎలిస్ అన్ అల్లెన్‌కు ఇచి్చన ఈ ఇంటర్వ్యూ గురువారం ప్రచురితమైంది. ‘కేథలిక్ చర్చిలోకి అందరూ ఆహా్వనితులే’అంటూ ఎల్జీబీటీక్యూ ప్లస్ కేథలిక్కులను ఉద్దేశించి దివంగత పోప్ ఫ్రాన్సిస్ ఇచ్చిన సందేశాన్ని తానూ స్వీకరిస్తున్నానన్నారు. లైంగిక సంబంధ అంశాల్లో చర్చి వైఖరి మారడానికి దాదాపుగా అవకాశమేలేదని స్పష్టం చేశారు.
హోమోసెక్సువల్ వ్యక్తులను కూడా గౌరవించాలని కేథలిక్ చర్చి చెబుతోందన్నారు. అయితే, స్వలింగ వివాహాన్ని చర్చి వ్యతిరేకిస్తుందన్నారు. వివాహం ఆడ, మగ జరగాల్సిందని స్పష్టంగా చెబుతోందని పోప్ లియో అన్నారు. చైనాతో సంబంధాలపై ఆయన..బిషప్పుల నియామకంపై 2018లో చైనాతో చేసుకున్న వివాదాస్పద ఒప్పందంలో సమీప భవిష్యత్తులో మార్పులు జరిగే అవకాశం లేదని భావిస్తున్నానన్నారు. చైనాలో వివిధ చర్చిల పరిధిలో ఉన్న కోటికి పైగా కేథలిక్కులను ఏకం చేసే లక్ష్యంతో పోప్ ఫ్రాన్సిస్ హయాంలో వాటికన్ ఈ ఒప్పందం కుదుర్చుకుంది.
చర్చిల్లో లైంగిక వేధింపుల కుంభకోణాలను ప్రస్తావించిన పోప్ లియో..నిజంగా ఇదో సంక్షోభమన్నారు. బాధితుల్లో 90 శాంత వరకు ముందుకొచ్చి తన ఆరోపణలు చేస్తున్నారని, వీరి సాంత్వన కలిగించే విషయంలో చర్చి వ్యవస్థ ఒక పరిష్కారాన్ని కనుగొనలేకపోయిందని చెప్పారు. అదే సమయంలో మతబోధకుల హక్కులను కూడా గౌరవించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రపంచ వ్యవహారాలపై అమెరికా పలుకుబడి గణనీయంగా ఉందన్న లియో..కేథలిక్ చర్చి వలసలను కూడా ఒక ముఖ్యమైన అంశంగానే భావిస్తోందని స్పష్టం చేశారు. ట్రంప్ ప్రభుత్వ వలసదారుల వ్యతిరేక చర్యలను పోప్ ఫ్రాన్సిస్ ఇచి్చన పిలుపు మేరకు అమెరికా బిషప్పులు బహిరంగంగానే వ్యతిరేకించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తోటి మనిషిని తగు రీతిలో గౌరవించాలన్నదే తమ అభిమతమని చెప్పారు.