breaking news
saint declared
-
టీనేజ్ సెయింట్!
వాటికన్ సిటీ: కార్లో అక్యూటిస్. వీడియో గేమ్స్ ఆడుతూ, పెంపుడు జంతువులతో వీడియోలు చేస్తూ సరదాగా గడిపిన టీనేజర్. అదే సమయంలో డిజిటల్ వేదికల ద్వారా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ ప్రచారానికి ఎనలేని కృషి చేసిన ‘దైవ ప్రభావకుడు (గాడ్స్ ఇన్ఫ్లుయెన్సర్)’. లుకేమియా (రక్త కణజాల క్యాన్సర్) బారిన పడి 15 ఏళ్ల వయసులోనే కన్నుమూసిన కార్లోకు సెయింట్ హోదా కట్టబెట్టి క్యాథలిక్ చర్చి పెను సంచలనం సృష్టించింది. వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో అసంఖ్యాకంగా గుమిగూడిన విశ్వాసుల సాక్షిగా.. కార్లో తల్లిదండ్రులు, కుటుంబీకుల సమక్షంలో పోప్ లియో–14 ఆదివారం స్వయంగా సెయింట్‌హుడ్ ప్రకటించారు. డిజిటల్ వేదిక ద్వారా క్రైస్తవాన్ని లక్షలాది మంది విశ్వాసులకు చేరువ చేసినందుకు గౌరవసూచకంగా కార్లోను ఈ విధంగా గౌరవించుకున్నట్టు వాటికన్ వర్గాలు తెలిపాయి. సెయింట్ హోదా పొందిన తొలి మిలీనియల్గా కార్లో చరిత్ర పుటలకెక్కారు. 1980–90 మధ్య పుట్టిన వారిని మిలీనియల్స్ అంటారన్నది తెలిసిందే. కార్లో లుకేమియా బారిన పడి 2006లో 15 ఏళ్లకే స్వర్గస్థులయ్యారు. దేవునికి అంకితమై కార్లో అప్పటికే తన జీవితంలో ఎన్నో అద్భుతాలను చేశారని సెయింట్‌హుడ్ కార్యక్రమంలో పోప్ కీర్తించారు. ఆయన పోప్‌గా బాధ్యతలు చేపట్టాక ఈ కార్యక్రమం నిర్వహించడం ఇదే తొలిసారి. ‘‘మరణానంతరం కార్లో రెండు అద్భుతాలకు కారకుడయ్యారు. పాంక్రియాటిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్న ఓ బ్రెజిల్ చిన్నారి తల్లిదండ్రులు కార్లోను స్తుతించగా వ్యాధి నయమైంది. ప్రమాదం బారిన పడ్డ ఓ కోస్టారికా విద్యార్థి కార్లోను ప్రారి్థంచి కోలుకున్నాడు’’అని పోప్ వెల్లడించారు.‘అత్యాధునిక’ ఆధ్యాత్మిక కెరటం! జీన్స్. టీ–షర్ట్. స్నీకర్ షూ. అల్ట్రా మోడర్న్ టీనేజర్‌కు అచ్చమైన ప్రతీక కార్లో. కానీ పయనించిందంతా ఆధ్యాత్మిక మార్గం. ఇంతటి వైరుధ్యానికి మారుపేరుగా నిలిచిన కార్లో 1991లో ఇటాలియన్ తల్లిదండ్రులకు లండన్‌లో పుట్టారు. తర్వాత వారి కుటుంబం ఇటలీలోని మిలాన్‌కు మారింది. చిన్నతనంలో అల్లరి పిడుగే అయినా పదేళ్లు దాటకుండానే క్రైస్తవం, క్రీస్తు బోధల పట్ల అచంచల విశ్వాసం పెంచుకున్నారు. పక్కింటి పిల్లాడిలా అత్యంత సాదాగా కనిపించినా, అసాధారణ పనులతో క్యాథలిక్ ప్రపంచంలో చెరిగిపోని పేరు సంపాదించుకున్నారు. కంప్యూటర్ కోడింగ్‌పై కార్లోకు అపారమైన పట్టుంది. క్రీస్తు బోధలను, ఆయన చూపిన అద్భుతాలను ప్రపంచమంతటికీ తెలిపే లక్ష్యంతో ‘క్యాథలిక్ ఫెయిత్’ ఏకంగా ఓ బహుభాషా వెబ్సైట్ పెట్టారు. లుకేమియా బారిన పడి మరణించాక ఆయన దేహాన్ని విశ్వాసుల సందర్శనార్థం ఇటలీలోని అసిసీ నగరంలో గాజుపేటికలో భద్రపరిచారు. ఆయన చివరగా ధరించిన జీన్స్, నైక్ ట్రైనర్ దుస్తుల్లోనే ఉంచడం విశేషం! దాన్ని ఏటా లక్షలాది మంది సందర్శిస్తారు. -
పోప్ పాల్ Vఐకు సెయింట్ గౌరవం
వాటికన్ సిటీ: 1960ల్లో క్యాథలిక్ చర్చిలో రెండవ వాటికన్ మండలి ద్వారా సమూల మార్పులు తీసుకొచ్చిన పోప్ ఆరవ పాల్‌ను సెయింట్‌గా గుర్తించి గౌరవించనున్నట్లు వాటికన్ బుధవారం ప్రకటించింది. శాన్ సాల్వడార్లో క్రైస్తవ ప్రధాన మతగురువుగా పనిచేస్తూ 1980ల్లో సామాజిక న్యాయం, ప్రజల అణచివేతలపై ప్రశ్నించి హత్యకు గురైన ఆస్కార్ రొమెరోకు కూడా సెయింట్‌హుడ్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై పోప్ ఫ్రాన్సిస్ మంగళవారమే సంతకం చేశారు. -
మదర్ థెరిసాకు సెయింట్‌హుడ్
-
సెయింట్ మదర్ ధెరిసా
-
మదర్ ధెరిసాకు సెయింట్‌హుడ్
-
మదర్ ధెరిసాకు సెయింట్‌హుడ్
వాటికన్ సిటీ: భారతరత్న, నోబెల్ శాంతి బహుమతి విజేత మదర్ థెరిసాకు ఆదివారం వాటికన్ సిటీలో సెయింట్‌హుడ్ బహూకరించారు. రోమన్ కేథలిక్ చర్చి పోప్ ఫ్రాన్సిస్ ఈ గొప్ప బిరుదును ఇచ్చారు. ఈ మహత్కార్యక్రమానికి భారత్ తరపున విదేశాంగ మంత్రి సుష్మస్వరాజ్, ఢిల్లీ, బెంగాల్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, మమత బెనర్జీ తదితరులు హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా థెరిసా అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిర్యాణం తర్వాత ఎవరైనా మదర్, ఫాదర్లు తమను కొలిచిన వారికి అనారోగ్యాన్ని నయం చేయటం, సమస్యలనుంచి గట్టెక్కించటం చేస్తే వారికి ఈ అరుదైన గౌరవాన్ని అందిస్తారు. ఒక అద్భుతం చేసినట్లు గుర్తిస్తే పవిత్రమూర్తిగా (బీటిఫైడ్), 2 అద్భుతాలు జరిగితే దేవతామూర్తిగా (సెయింట్)గా గుర్తిస్తారు. సాక్ష్యాలు సేకరించి వాటిని ధృవీకరించుకున్నాకే పేరును ప్రకటిస్తారు. థెరిసా గురించి క్లుప్తంగా.. జననం: 1910 ఆగస్టు 26 జన్మస్థలం: మెసడోనియా రాజధాని స్కోప్జె తల్లిదండ్రులు: నికోలా బొజాక్షియు, డ్రేన్ అసలు పేరు: ఆగ్నెస్ గోన్షా బొజాక్షియు థెరిసాగా పేరు మార్పు: 1929లో భారత్‌కు వచ్చాక ఉద్యోగం: కలకత్తాలోని సెయింట్ మేరీస్ ఉన్నత పాఠశాలలో 1931-48 మధ్య ఉపాధ్యాయురాలు సొంత చారిటీ సంస్థ: ద మిషనరీస్ ఆఫ్ చారిటీ-1950 అక్టోబర్ 7న ప్రారంభం పురస్కారాలు: మెగసెసే(1962), నోబెల్ బహుమతి (1979), భారత రత్న (1980) మరణం: కలకత్తాలో 1997 సెప్టెంబర్ 5