ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది మృతి | Twenty People Died In Nepal Road Accident | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది మృతి

Dec 15 2018 12:16 PM | Updated on Dec 15 2018 4:28 PM

Twenty People Died In Nepal Road Accident - Sakshi

ఖాట్మాండ్‌: నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ట్రక్కు లోయలో పడిపోవడంతో 20మంది మరణించగా, మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఖాట్మాండ్‌ సమీపంలోని నువాకోట్‌ జిల్లాలో శనివారం ఈ ప్రయాదం జరిగింది. గాయపడ్డ వారిని సెంట్రల్‌ నేపాల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

అధికారుల సమాచారం ప్రకారం గయాంగడండా ప్రాంతంలో కొండపై నుంచి వెళ్తున్న ట్రక్కు అదుపు తప్పి 100 మీటర్ల లోయలో పడిపోవడంతో ఈప్రమాదం  సంభవించింది. ఇప్పటి వరకు 20 మృత దేహాలను వెలికితీసినట్లు పోలీస్‌ అధికారి గయాన్‌లాల్‌ యాదవ్‌ తెలిపారు. ట్రక్కులో ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించుకోవడంతోనే వాహనం అదుపుతప్పినట్లు అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement