‘అది డొనాల్డ్‌ ట్రంప్‌ ఇష్టం’ | Trump Has No Problem With Masks Says McEnany | Sakshi
Sakshi News home page

‘మాస్క్‌ ధరించడానికి ట్రంప్‌కు అభ్యంతరం లేదు’

Jun 30 2020 5:43 PM | Updated on Jun 30 2020 6:39 PM

Trump Has No Problem With Masks Says McEnany - Sakshi

వాషింగ్టన్‌: అగ్రరాజ్యంలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు విజృంభిస్తున్నాయి. అయితే దీనిని అడ్డుకోవడానికి మాస్క్‌ పెట్టుకోవడం ఒక మార్గం అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నమ్ముతున్నారని, అది ఆయన వ్యక్తిగతమని వైట్‌ హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కైలీ మెక్ ఎనానీ సోమవారం తెలిపారు. ఫోర్లిడాలోని జాక్సన్‌విల్లేలో మాస్క్‌లు తప్పని సరిగా ధరించాలి అనే నిబంధనపై ఆమె మాట్లాడుతూ, ‘అది ఆయన వ్యక్తిగతమైన నిర్ణయం. మాస్క్‌ ధరించడం, ధరించకపోవడం అది వారి ఇష్టం అని సమాధానమిచ్చారు. వారి భద్రతకు సంబంధించి ప్రజలు ఎలాంటి చర్యలు తీసుకున్నా ట్రంప్‌ వాటిని ప్రోత్సహిస్తారని ఆమె తెలిపారు. మాస్క్‌లు ధరించడంలో ట్రంప్‌కు ఎలాంటి అభ్యంతరం లేదని, స్థానిక చట్టాల్ని గౌరవిస్తానని ట్రంప్‌ తనతో చెప్పారని మెక్ ఎనానీ తెలిపారు. 

(ట్రంప్ ప్ర‌మాద‌క‌ర‌మైన వ్య‌క్తి: మేరీ ట్రంప్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement