న్యూఢిల్లీ : కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడెవూ బుధవారం తమిళ సంప్రదాయం ప్రకారం సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. కెనడాలో స్థిరపడిన తమిళులతో కలసి ‘వెట్టి’ (తమిళ సంప్రదాయ దుస్తులు) ధరించిన ప్రధాని, పొంగల్‌ను తయారు చేశారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను తన ట్విటర్ అకౌంట్‌లో పోస్టు చేశారు ట్రూడెవూ. తమిళ కెనడియన్లతో కలసి పొంగల్ పండుగను జరుపుకోవడం తనకు ఆనందంగా ఉందని అన్నారు.
ఈ వేడుకల్లో ట్రూడెవూతో పాటు టొరంటో మేయర్ జాన్ టోరీ కూడా పాల్గొన్నారు. ట్రూడెవూ, టోరీలు కలసి పొంగల్‌ను వండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment