ఐసిస్‌ నరమేధం.. 74 మంది మృతి | Suicide bomb and gun attacks on Iraqi restaurant and police chekpost | Sakshi
Sakshi News home page

ఐసిస్‌ నరమేధం.. 74 మంది మృతి

Sep 15 2017 7:46 AM | Updated on Oct 2 2018 2:30 PM

ఐసిస్‌ నరమేధం.. 74 మంది మృతి - Sakshi

ఐసిస్‌ నరమేధం.. 74 మంది మృతి

ఇరాక్, సిరియాల్లో నెత్తుటేర్లు పారిస్తున్న ఉగ్రసంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ మరోసారి రెచ్చిపోయింది.

నసీరియా:  ఇరాక్, సిరియాల్లో నెత్తుటేర్లు పారిస్తున్న ఉగ్రసంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ మరోసారి రెచ్చిపోయింది. ఇరాక్‌లోని దిఖర్‌ ప్రావిన్సు నసీరియా పట్టణంలో ఓ రెస్టారెంట్‌పై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఐసిస్‌ ఉగ్రవాదులు, అనంతరం సమీపంలోని చెక్‌పోస్ట్‌పై ఆత్మాహుతిదాడికి పాల్పడ్డారు.

ఈ దాడిలో  74 మంది దుర్మరణం చెందగా, 91 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. గాయపడ్డవారిలో చాలామంది పరిస్థితి ఇంకా విషమంగానే ఉందన్నారు. ఐసిస్‌కు వ్యతిరేకంగా భద్రతాబలగాలతో కలిసి పోరాడుతున్న షియా సంస్థ ‘హషీద్‌ అల్‌ షాబీ’ సభ్యుల రూపంలో ఉగ్రవాదులు చెక్‌పోస్ట్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ దాడి చేసింది తామేనని ఐసిస్‌ ప్రకటించింది.

Advertisement
 
Advertisement
Advertisement