వేరే దేశానికి వెళ్లాల్సిన విమానం అది. దాన్ని నడిపించాల్సిన పైలట్ ఫుల్లుగా తాగేసి వచ్చాడు.
వేరే దేశానికి సుదీర్ఘ ప్రయాణం చేయాల్సిన విమానం అది. దాన్ని నడిపించాల్సిన పైలట్ మాత్రం ఫుల్లుగా తాగేసి ఊగుతూ వచ్చాడు. అతగాడి తీరు చూసి అనుమానంతో అధికారులు బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేస్తే.. అయ్యగారు మందేసిన విషయం బయటపడింది. దాంతో విమానాన్ని నడపకుండా అతగాడిని ఆపేశారు. ఈ కారణంగా ఆ విమానంలో వెళ్లాల్సిన 259 మంది ప్రయాణికులకు 15 గంటలు ఆలస్యమైంది. ఉపేంద్ర రణవీర అనే సదరు పైలట్‌కు గతంలో జారీచేసిన లైసెన్సును సస్పెండ్ చేస్తున్నట్లు డీజీసీఏ నిమల్‌సిరి తెలిపారు. అతడి లైసెన్సు పూర్తిగా ఎందుకు రద్దు చేయకూడదో ఏడు రోజుల్లోగా చెప్పాలని చెప్పాలని నోటీసు ఇచ్చారు.
కొలంబో నుంచి జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ వెళ్లాల్సిన యూఎల్ 554 విమానం ఈ పైలట్ కారణంగా 15 గంటలు ఆలస్యంగా బయల్దేరింది. దీంతో విమానయాన సంస్థ ప్రయాణికులకు క్షమాపణ చెప్పింది. వారందరికీ ఈయూ నిబంధనల ప్రకారం భోజనాలు, వసతి ఏర్పాట్లు చేశారు. దాంతోపాటు ఒక్కొక్కరికి రూ. 45 వేల (600 యూరోలు) పరిహారం కూడా చెల్లించారు. కేవలం ఈ పరిహారానికే ఆ విమానయాన సంస్థపై దాదాపు కోటి రూపాయలకు పైగా భారం పడింది.