ఇంటర్‌పోల్‌ కొత్త అధ్యక్షుడిగా కిమ్‌ యాంగ్‌

South Korean Kim Jong-yang elected as Interpol president - Sakshi

దుబాయ్‌: అంతర్జాతీయ పోలీస్‌ సంస్థ ఇంటర్‌పోల్‌కు నూతన అధ్యక్షుడు నియమితులయ్యారు. యూఏఈలోని దుబాయ్‌లో బుధవారం జరిగిన వార్షిక సమావేశంలో దక్షిణకొరియాకు చెందిన కిమ్‌ జాంగ్‌ యాంగ్‌(57)ను కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు ఇంటర్‌పోల్‌ తెలిపింది. ఈ పదవిలో యాంగ్‌ 2020 వరకూ కొనసాగుతారు. ఇప్పటివరకూ ఇంటర్‌పోల్‌ అధ్యక్షుడిగా ఉన్న చైనా మాజీ మంత్రి మెంగ్‌ హాంగ్వే సెప్టెంబర్‌లో అదృశ్యం కావడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. చైనా ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో భాగంగా లంచం ఆరోపణలపై బీజింగ్‌లో విమానం దిగగానే  ఆ దేశ అధికారులు మెంగ్‌ హాంగ్వేను అదుపులోకి తీసుకున్నారు.  ఈ ఎన్నికల సందర్భంగా రష్యా అభ్యర్థి, ఇంటర్‌పోల్‌ ఉపాధ్యక్షుడు అలెగ్జాండర్‌ ప్రోకోప్‌చుక్‌ అభ్యర్థిత్వాన్ని అమెరికా నేతృత్వంలోని పశ్చిమదేశాలు వ్యతిరేకించాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top