తిక్క బుద్ధి జైలుపాలు చేసింది | Shocking video shows overweight Spanish farmworker CRUSHING dozens of piglets to death | Sakshi
Sakshi News home page

తిక్క బుద్ధి జైలుపాలు చేసింది

Jan 21 2016 5:12 PM | Updated on Jun 4 2019 5:16 PM

తిక్క బుద్ధి జైలుపాలు చేసింది - Sakshi

తిక్క బుద్ధి జైలుపాలు చేసింది

పుర్రెకో బుద్ధి.. జిహ్వాకో రుచి అంటుంటారు. ఇక్కడ జిహ్వ మాట పక్కకు పెడితే స్పెయిన్లో ఓ వ్యక్తి పుర్రెకు వచ్చిన వింత బుద్ధి అతడిని కటకటాలపాలు చేసింది.

స్పెయిన్: పుర్రెకో బుద్ధి.. జిహ్వాకో రుచి అంటుంటారు. ఇక్కడ జిహ్వ మాట పక్కకు పెడితే స్పెయిన్లో ఓ వ్యక్తి పుర్రెకు వచ్చిన వింత బుద్ధి అతడిని కటకటాలపాలు చేసింది. మూగజీవాల యోగ క్షేమాలు చూసుకునే అతడు పిచ్చి ఆలోచనతో వింత చేష్టలు చేయడంతో జైలు ఊచలు లెక్కబెట్టాల్సి వచ్చింది. 22 ఏళ్లకే భారీ ఆకారంతో ఉన్న ఓ యువకుడు.. తాను మంచిచెడులు చూసుకునే ఓ పందుల గుంపులోకి దూకి వాటిపై పడి ఇష్టమొచ్చినట్లు దొర్లడంతో దాదాపు 19 పందులు అక్కడికక్కడే చనిపోగా.. మరో 53పందులు తీవ్రగాయాలపాలయై అనంతరం చనిపోయాయి.

ఈ తంతునంతా అతడి పక్కనే ఉన్న మరో యువకుడు(19) చూస్తూ ఎంజాయ్ చేస్తూ వీడియో తీసి వాట్సాప్ లో పెట్టాడు. ఇది కాస్త ఆ పందుల పెంపకం యజమాని దగ్గరకు చేరి అతడు చూడటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఇంకాస్త వివరాల్లోకి వెళితే, స్పెయిన్ లో ఓ వ్యక్తి భారీ సంఖ్యలో పందులను పెంచుతున్నాడు. వాటి మంచిచెడూ, తిండితిప్పలు చూసేందుకు ఇద్దరు యువకులను పెట్టుకున్నాడు.

అయితే, ఆ ఇద్దరిలో బాగా లావుగా ఉన్న వ్యక్తికి ఆ పందులను చూసి ఏమనిపించిందో.. తాను పందులపై పడి దొర్లుతానని, ఆ సమయంలో జరిగే మొత్తాన్ని వీడియో తీయాలని మరో యువకుడికి చెప్పి అమాంతం వాటిపై పడ్డాడు. అలా పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ ఉండగా.. అతడు చేస్తున్న తిక్క పనులు చూస్తూ బిగ్గరగా నవ్వుతూ వీడియో తీసి వాట్సాప్ లో పెట్టాడు. అంతే, చివరకు ఇద్దరూ బుక్ అయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement