ఎల్విస్ గిటారుకు రూ.2.25 కోట్లు | Rs 2.25 crore to Elvis guitar | Sakshi
Sakshi News home page

ఎల్విస్ గిటారుకు రూ.2.25 కోట్లు

May 23 2016 7:02 PM | Updated on Apr 3 2019 9:01 PM

ఎల్విస్ గిటారుకు రూ.2.25 కోట్లు - Sakshi

ఎల్విస్ గిటారుకు రూ.2.25 కోట్లు

సంగీత ప్రపంచంలో రాక్ అండ్ రోల్ రారాజుగా పేరొందిన అమెరికన్ గాయకుడు, నటుడు ఎల్విస్ ప్రెస్లీకి చెందిన గిటారు న్యూయార్క్‌లో జరిగిన వేలంలో రికార్డుస్థాయిలో రూ.2. 25కోట్లకు అమ్ముడుపోయింది.

న్యూయార్క్: సంగీత ప్రపంచంలో రాక్ అండ్ రోల్ రారాజుగా పేరొందిన అమెరికన్ గాయకుడు, నటుడు ఎల్విస్ ప్రెస్లీకి చెందిన గిటారు న్యూయార్క్‌లో జరిగిన వేలంలో రికార్డుస్థాయిలో రూ.2. 25కోట్లకు అమ్ముడుపోయింది. 1969లో ఎల్విస్ ఆయన తండ్రి దీనిని బహూకరించారు. ఆ తర్వాత 1975లో ఓ అభిమానికి ఎల్విస్ దీన్ని కానుకగా ఇచ్చాడు.

జూలియన్‌సంస్థ నిర్వహించిన ఇదే వేలంలో గాయకుడు మైఖేల్ జాక్సన్  కోటు రూ.1.72 కోట్ల ధర పలికింది. బీటిల్స్ బ్యాండ్ సహ వ్యవస్థాపకుడు, సంగీతకళాకారుడు జాన్ లెనిన్ స్వదస్తూరితో రాసిన పాట రూ.2.38కోట్లకు అమ్ముడుపోయింది.

Advertisement
 
Advertisement
Advertisement