breaking news
Rock and Roll
-
ప్రముఖ సింగర్ కన్నుమూత
ప్రముఖ సింగర్ టీనా టర్నర్ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న 83 ఏళ్ల గాయని స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ సమీపంలోని కుస్నాచ్ట్లోని తన ఇంటిలో బుధవారం మరణించారు. ఈ వార్త విన్న హాలీవుడ్ ప్రముఖులు ఆమెకు సంతాపం ప్రకటిస్తున్నారు. ఆమెను క్వీన్ ఆఫ్ రాక్ అండ్ రోల్ అని కూడా పిలుస్తారు. (ఇది చదవండి: మళ్లీ పెళ్లి ఆపాలంటూ కోర్టును ఆశ్రయించిన నరేశ్ మూడో భార్య) టీనా టర్నర్ ఎవరు? నవంబర్ 26, 1939న అన్నా మే బుల్లక్లో టీనా టర్నర్ జన్మించారు. ఆమె 1960-70 మధ్యకాలంలో ఆమె భర్త ఐకే టర్నర్‌తో కలిసి ఫేమస్ అయింది. ఆమె తన వాయిస్, ప్రదర్శనలతో రాక్, సోల్ సంగీతంలో పేరు సంపాదించారు. అయితే ఆ తర్వాత భర్తతో విడిపోయిన టీనా సోలోగా కెరీర్‌ను ప్రారంభించింది. 1980లలో ఆమె "ప్రైవేట్ డ్యాన్సర్" ఆల్బమ్ విడుదల చేసింది. ఆ తర్వాత "వాట్స్ లవ్ గాట్ టు డూ విత్ ఇట్", "ప్రైవేట్ డ్యాన్సర్" వంటి హిట్ పాటలు అందించింది. తన కెరీర్లో టీనా టర్నర్ ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల రికార్డులు సృష్టించింది. (ఇది చదవండి: భర్తకు విడాకులిచ్చిన బుల్లితెర నటి? ఫోటోతో క్లారిటీ!) ఆమె సంగీతంతో పాటు నటనలోకి ప్రవేశించింది. టామీ, మ్యాడ్ మాక్స్ బియాండ్ థండర్‌డోమ్, వాట్స్ లవ్ గాట్ టు డూ విత్ ఇట్ వంటి చిత్రాలలో ముఖ్య పాత్రలు చేసింది. టీనా సంగీతానికి గ్రామీ అవార్డులు, రాక్ అండ్ రోల్ హాల్ ఆఫ్ ఫేమ్, కెన్నెడీ సెంటర్ ఆనర్స్, హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నారు. -
ఎల్విస్ గిటారుకు రూ.2.25 కోట్లు
న్యూయార్క్: సంగీత ప్రపంచంలో రాక్ అండ్ రోల్ రారాజుగా పేరొందిన అమెరికన్ గాయకుడు, నటుడు ఎల్విస్ ప్రెస్లీకి చెందిన గిటారు న్యూయార్క్‌లో జరిగిన వేలంలో రికార్డుస్థాయిలో రూ.2. 25కోట్లకు అమ్ముడుపోయింది. 1969లో ఎల్విస్ ఆయన తండ్రి దీనిని బహూకరించారు. ఆ తర్వాత 1975లో ఓ అభిమానికి ఎల్విస్ దీన్ని కానుకగా ఇచ్చాడు. జూలియన్సంస్థ నిర్వహించిన ఇదే వేలంలో గాయకుడు మైఖేల్ జాక్సన్ కోటు రూ.1.72 కోట్ల ధర పలికింది. బీటిల్స్ బ్యాండ్ సహ వ్యవస్థాపకుడు, సంగీతకళాకారుడు జాన్ లెనిన్ స్వదస్తూరితో రాసిన పాట రూ.2.38కోట్లకు అమ్ముడుపోయింది.