వామ్మో! అంతపెద్ద పాముతో ఫొటో దిగిన పోలీస్‌!

Queensland police python photo gains internet fame - Sakshi

దాదాపు ఐదుమీటర్ల పొడవున్న ఓ భారీ కొండచిలువతో ఓ పోలీసాయన ఫొటో దిగాడు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో భారీగా హల్‌చల్‌ చేస్తోంది. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో ఓ పోలీసు అధికారి, ఆయన జూనియర్‌ కలిసి అడవిలో గస్తీ చేపడుతున్నారు. ఈ సమయంలో ఓ భారీ కొండచిలువ దానిమానాన అది పోతూ వారి కంట కనబడింది. అదే అదనుగా భావించిన సదరు పోలీసు అధికారి పాము సమీపంలో ఫొజుఇవ్వగా.. జూనియర్‌ ఓ ఫొటో తీశాడు. గతంలో తీసిన ఈ ఫొటోను క్వీన్స్‌లాండ్‌ పోలీసులు తమ సోషల్‌ మీడియా పేజీలో సోమవారం షేర్‌ చేసుకున్నారు. ‘మా డ్యూటీ అంత బోరింగ్‌ ఏమీ ఉండదు. సింగిల్‌ షిఫ్ట్‌లో ఏం ఎదురుపడుతుందో చెప్పలేం’ అంటూ పోలీసులు పెట్టిన ఈ పోస్ట్‌ను ఇప్పటికే  20లక్షలకుపైగా మంది ఈ ఫొటోను చూశారు. 10వేల మంది కామెంట్లు చేశారు. ‘మోన్‌స్టర్‌ పైథాన్‌’  ఓ మైగాడ్‌, హెల్‌ నో అంటూ కామెంట్లు పెట్టారు.

క్వీన్స్‌ల్యాండ్‌ ఉత్తర నగరం కైర్న్స్‌కు 345 కిలోమీటర్ల దూరంలోని వుజుల్‌ వుజుల్‌ అడవిలో ఈ కొండచిలువ అధికారులకు దర్శనమిచ్చింది. ఇక్కడ ఉండే క్రూబ్‌ పైథాన్‌లు ఆస్ట్రేలియాలోనే పొడవైనవి. ఒక్కొక్కటి ఏడు మీటర్ల (23అడుగుల) వరకు పెరుగుతాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top