పెంట్‌హౌస్@ రూ.2,424 కోట్లు! | Penthaus @ Rs .2,424 crore! | Sakshi
Sakshi News home page

పెంట్‌హౌస్@ రూ.2,424 కోట్లు!

Aug 21 2014 1:53 AM | Updated on Aug 18 2018 8:37 PM

పెంట్‌హౌస్@ రూ.2,424 కోట్లు! - Sakshi

పెంట్‌హౌస్@ రూ.2,424 కోట్లు!

హర్మ్యం.. ఆపై అందులో ఓ భారీ ఈతకొలను.. చూడటానికి ఎంతో అద్భుతంగా ఉంది కదూ?

సముద్రం పక్కనే అద్దాలతో కూడిన అందమైన ఆకాశ

హర్మ్యం.. ఆపై అందులో ఓ భారీ ఈతకొలను.. చూడటానికి ఎంతో అద్భుతంగా ఉంది కదూ? ఇది మొనాకోలోని ఓడియన్ టవర్. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన అపార్ట్‌మెంట్. సౌకర్యా లు, ధర పరంగా ఇందులోని ఫ్లాట్లన్నీ ఒక ఎత్తయితే, పెంట్‌హౌస్ ఒక్కటీ మరో ఎత్తు.

ఏకంగా ఐదు అంతస్తుల పొడవులో నిర్మించిన ఈ పెంట్‌హౌస్‌ను చూడటానికి రెండు కళ్లూ చాలవు. స్విమ్మింగ్‌పూల్‌తో సహా అత్యంత విలాసవంతమైన సమస్త సౌకర్యాలూ ఇందులో ఉన్నాయి. వచ్చే ఏడాదికి పూర్తికానున్న ఈ పెంట్‌హౌస్ ధర ఎంతో తెలుసా? 24 కోట్ల పౌండ్లు.. మన కరెన్సీలో చెప్పాలంటే.. దాదాపు రూ. 2,424 కోట్లు అన్నమాట. ధర చూస్తే గుండె గుభేల్‌మంటోంది కదూ..?
 

Advertisement
 
Advertisement
Advertisement