పాకిస్తాన్‌ మరో కీలక నిర్ణయం..! | Pakistan Take A Key Decision Over India Amidst Article 370 Cancellation | Sakshi
Sakshi News home page

పాక్‌ గగనతలంలో భారత విమానాలకు ‘నో’ 

Aug 28 2019 10:30 AM | Updated on Aug 28 2019 1:54 PM

Pakistan Take A Key Decision Over India Amidst Article 370 Cancellation - Sakshi

జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దుతో పాక్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

ఇస్లామాబాద్‌: జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దుతో పాక్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ గగనతలంలో భారత విమానాలపై నిషేధం విధిస్తున్నామని మంగళవారం ప్రకటించింది. అఫ్గానిస్తాన్‌కు వెళ్లే భారత వాణిజ్య విమానాలపై కూడా నిషేధం వర్తిస్తుందని పాక్‌ సైన్స్, సాంకేతిక మంత్రి ఫవాద్‌ చౌద్రీ స్పష్టం చేశారు. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఫవాద్‌ వెల్లడించారు. దీనికి సంబంధించిన న్యాయప్రక్రియలు త్వరలోనే పూర్తిచేయనున్నామని అన్నారు. ‘మోదీ ప్రారంభించారు.. మేం ముగిస్తాం’ అంటూ ఫవాద్‌ ట్వీట్‌చేశారు. బాలాకోట్‌ దాడుల వేళ తమ దేశంమీదుగా భారత విమానాల రాకపోకలను పాక్‌ నిషేధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement