‘మన్ కీ బాత్’లో ఒబామా | Obama to join Modi on 'Mann ki Baat' | Sakshi
Sakshi News home page

‘మన్ కీ బాత్’లో ఒబామా

Jan 23 2015 2:39 AM | Updated on Oct 9 2018 4:36 PM

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటనలో భాగంగా.. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో కలసి రేడియో ప్రసంగం కార్యక్రమంలో పాల్గొననున్నారు.

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటనలో భాగంగా.. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో కలసి రేడియో ప్రసంగం కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ నెల 27వ తేదీన తాను నిర్వహించే నెల వారీ ‘మన్ కీ బాత్’ రేడియో ప్రసంగ కార్యక్రమంలో ఒబామా కూడా పాల్గొంటారని మోదీ స్వయంగా గురువారం సామాజిక వెబ్‌సైట్ ట్వీటర్‌లో ప్రకటించారు. ‘‘ఈ నెల ‘మన్ కీ బాత్’ ప్రత్యేకంగా ఉంటుంది. మన గణతంత్ర దినోత్సవ అతిథి బరాక్ ఒబామా, నేను ఆ కార్యక్రమంలో ఉమ్మడిగా మా ఆలోచనలను పంచుకుంటాం’’ అని ఆయన ట్వీట్ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రజలు తమ ప్రశ్నలను పంపించవచ్చని పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement