నేపాల్‌– భారత్‌  మధ్య కొత్త చెక్‌పోస్ట్‌ 

New Check Post Between Nepal-India - Sakshi

సంయుక్తంగా ప్రారంభించిన ఇరుదేశాల ప్రధానులు 

కఠ్మాండు/న్యూఢిల్లీ: భారత్‌– నేపాల్‌ సరిహద్దుల్లో భారత్‌ సాయంతో నేపాల్‌ నిర్మించిన ‘జోగ్‌బని–బిరాట్‌నగర్‌’ ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్ట్‌ను వీడియో లింక్‌ ద్వారా మంగళవారం ఇరుదేశాల ప్రధానులు నరేంద్ర మోదీ, కేపీ శర్మ ఓలి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ చెక్‌పోస్ట్‌ నిర్మాణం కోసం భారత్‌ రూ. 140 కోట్ల ఆర్థిక సాయాన్ని నేపాల్‌కు అందించింది. ద్వైపాక్షిక వాణిజ్య వృద్ధి, ఇరుదేశాల ప్రజల మధ్య ప్రత్యక్ష సంబంధాలు లక్ష్యంగా ఈ చెక్‌పోస్ట్‌ను రూపొందించారు.

260 ఎకరాల్లో ఈ చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేశారు. చెక్‌పోస్ట్‌ను ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. స్నేహపూర్వక పొరుగు దేశాలతో సత్సంబంధాలకు భారత్‌ కట్టుబడి ఉందన్నారు. ఆ దేశాలతో వాణిజ్య, సాంస్కృతిక, విద్యావిషయక సంబంధాలు మెరుగుపడే దిశగా భారత్‌ చర్యలు తీసుకోవడం కొనసాగిస్తుందన్నారు. భారత ప్రధానికి నేపాల్‌ పీఎం కేపీ శర్మ ఓలి కృతజ్ఞతలు తెలిపారు. మోదీని నేపాల్‌లో పర్యటించాల్సిందిగా ఆహ్వానించారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top