నేపాల్ భూకంపం: 2300కు పెరిగిన మృతుల సంఖ్య

నేపాల్ భూకంపం:  2300కు పెరిగిన మృతుల సంఖ్య


ఖాట్మండు: భూకంపం నేపాల్ను కకావికలం చేసింది. మృతుల సంఖ్య గంటగంటకూ పెరుగుతోంది.  భూప్రకంపనల వల్ల ఇప్పటివరకు 2,300 మంది మరణించినట్టు పోలీసులు తెలిపారు. 2వేలకు పైగా మృతదేహాలను వెలికితీశారు. మరో 5,850 మంది తీవ్రంగా గాయపడ్డారు.శనివారం నేపాల్లో సంభంవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.9గా నమోదైన సంగతి తెలిసిందే. నేపాల్లో పురాతన కట్టడాలు, ఆలయాలు, ప్రభుత్వ భవనాలు, ఇళ్లు వేల సంఖ్యలో నేలమట్టమయ్యాయి. శనివారం రాత్రంతా ప్రజలు రోడ్లపైనే జాగారం చేశారు. నేపాల్ నుంచి 4 ప్రత్యేక విమానల ద్వారా 564 మంది భారతీయులను సురక్షితంగా తరలించారు. మరో పది విమానాలను నేపాల్కు పంపారు. నేపాల్లో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.నేపాల్లో ఈ రోజు కూడా భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.7గా నమోదైంది. ఇప్పటికే బిక్కుబిక్కుమంటున్న అక్కడి ప్రజులు తీవ్ర ఆందోళనలో కూరుకుపోయారు. భారత రాజధాని ఢిల్లీని కూడా భూప్రకంపనలు చుట్టుముట్టాయి. ప్రజలంతా భయాందోళనలతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఉత్తర భారత మంతా కంపించిపోయింది. ముఖ్యంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్లో భూప్రకంపనలు వచ్చాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top