అమెరికాలో టిమోటి రే జోన్స్ అనే వ్యక్తి తన ఇంట్లో ఐదుగురు చిన్నారులను కర్కశంగా చంపేసినట్టు కేసు నమోదైంది
వాషింగ్టన్: కన్న తండ్రే పిల్లల పాలిట కసాయిగా మారాడు. అమెరికాలో టిమోటి రే జోన్స్ అనే వ్యక్తి తన ఇంట్లో ఐదుగురు చిన్నారులను కర్కశంగా చంపేసినట్టు కేసు నమోదైంది. పిల్లల వయసు ఒకటి నుంచి ఎనిమిదేళ్ల మధ్య ఉంటుంది. పోలీసులు జోన్స్ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
హైవేలో పోలీసులు జోన్స్ కారును తనిఖీ చేసినపుడు అందులో రక్తపు మరకలు, పిల్లల దుస్తులు కనిపించాయి. వారం రోజుల క్రితం పిల్లలు కనిపించడం లేదని జోన్స్ నుంచి విడాకులు తీసుకున్న అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో జోన్స్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనే పిల్లలను హతమార్చినట్టు పోలీసులు భావిస్తున్నారు. హైవే సమీపంలో చిన్నారుల మృతదేహాలను గుర్తించారు. పిల్లలను హత్య చేయడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. 2001లో జోన్స్పై కారు దొంగతనం, కొకైన్ సరఫరా కేసులు నమోదయ్యాయి.