'స్కూళ్లపై దాడిచేస్తాం... 6.60లక్షల మందిని చంపేస్తాం' | Los Angeles shuts public schools | Sakshi
Sakshi News home page

'స్కూళ్లపై దాడిచేస్తాం... 6.60లక్షల మందిని చంపేస్తాం'

Dec 16 2015 2:01 AM | Updated on Jul 11 2019 5:12 PM

'స్కూళ్లపై దాడిచేస్తాం... 6.60లక్షల మందిని చంపేస్తాం' - Sakshi

'స్కూళ్లపై దాడిచేస్తాం... 6.60లక్షల మందిని చంపేస్తాం'

‘స్కూళ్లపై దాడిచేస్తాం. విద్యావ్యవస్థలోని 6.60లక్షల మందిని చంపేస్తాం’ అని పోలీసులకు వచ్చిన బెదిరింపుతో

లాస్ఏంజిలిస్: ‘స్కూళ్లపై దాడిచేస్తాం. విద్యావ్యవస్థలోని 6.60లక్షల మందిని చంపేస్తాం’ అని పోలీసులకు వచ్చిన బెదిరింపుతో అమెరికాలోని లాస్ ఏంజిలస్‌లో పాఠశాలలను  మూసేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం ఈ బెదిరింపు వచ్చిందని, విద్యార్థులకు ముప్పు వాటిల్లకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నెల 2న శాన్ బెర్నార్డినోలో పాక్ జాతీయులైన దంపతులు క్రిస్మస్ పార్టీపై దాడి చేసి 14 మందిని చంపడం తెలిసిందే. తాజా బెదిరింపుతో మొత్తం నగరం అప్రమత్తమైంది.
 

Advertisement
 
Advertisement
Advertisement