'తండ్రిగా వాడి కోరికను తీర్చా'

Justin Trudeau Takes Son Out For Ice Cream After Pandemic Restrictions - Sakshi

కెనడా : కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఒక కన్నతండ్రిగా తన కొడుకు కోరికను తీర్చాడు. కరోనాతో ఎమర్జెన్సీ విధించిన కెనడాలో ఆంక్షలను ప్రభుత్వం ఇప్పుడిప్పుడే సవరిస్తోంది. తాజాగా ట్రూడో తన 6 ఏళ్ల కొడుకు హెడ్రిన్‌తో కలిసి బుధవారం క్యూబెక్‌ ప్రావిన్స్‌లోని ఐస్‌క్రీమ్‌ పార్లర్‌కు వచ్చిన ఫోటో ఒకటి వైరల్‌గా మారింది.ఈ సందర్భంగా ట్రూడో మాట్లాడుతూ.. ' దేశానికి ప్రధానినైనా .. నేను ఓ బిడ్డకు తండ్రినే. సాధారణ ప్రజల్లానే నాకు నిబంధనలు వర్తిస్తాయి. ఇన్నాళ్లు లాక్‌డౌన్‌ ఉండడంతో నా కుటుంబాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్లలేకపోయాను. తాజాగా దేశంలో లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించడంతో నా కొడుకు ఐస్‌క్రీం కావాలని అడిగాడు. తండ్రిగా వాడి కోరిక తీర్చాలి కాబట్టి ఐస్‌క్రీం పార్లర్‌కు వచ్చా. హెడ్రిన్‌కు ఇష్టమైన వెనీలా ఫ్లేవర్‌ కోన్‌ తీసుకోవడంతో వాడు ఆనందంతో ఎగిరి గంతేశాడు.

కరోనా నేపథ్యంలో ప్రతీ షాపు నిబంధనలకు అనుగుణంగానే నడుచుకుంటున్నాయి. లాక్‌డౌన్‌ అమల్లో ఉండడంతో ఇన్నాళ్లు షాపులు మూసేయడంతో వ్యాపారులు ఆర్థికంగా నష్టపోయారు. కొన్ని రోజుల్లోనే పరిస్థితి మళ్లీ సాధారణ స్థితికి వస్తుందని ఆశిస్తున్నా.' అంటూ తెలిపారు. అనంతరం కొడుకు హెడ్రిన్‌తో కలిసి ఐస్‌క్రీం తినేసి అక్కడినుంచి వెళ్లిపోయారు. కాగా మర్చిలో కెనడాలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో మార్చి మధ్యలోనే అత్యవసర సేవలు మినహ దేశం మొత్తం లాక్‌డౌన్‌ విధించారు. కెనడాలో లక్షకు పైగా కరోనా కేసులు నమోదవ్వగా, 8,484 మంది కరోనాతో మృతి చెందారు.(భారత్‌కు భారం..డ్రాగన్‌కు వరం)

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top