ఆర్థిక ఇబ్బందులతోనే అరక్కల్ ఆత్మహత్య

Joy Arakkal Commits Suicide in Dubai Confirms Police - Sakshi

దుబాయ్‌ : కేర‌ళ‌కు చెందిన ప్ర‌ముఖ ఎన్నారై వ్యాపార‌వేత్త జాయ్ అరక్కల్ (54) దుబాయ్‌లో అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందిన విష‌యం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరపగా.. ఆయనది ఆత్మహత్యగా తేలింది. భారత్‌లోని కేరళకు చెందిన అరక్కల్‌ గతంలోనే దుబాయ్‌లో స్థిరపడ్డారు. ఓ చిరు ఉద్యోగిగా కెరీర్‌ను ప్రారంభించిన ఆయన.. అనతికాలంలో పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగారు. ఈ క్రమంలోనే ఏప్రిల్‌ 23న ఆయన నివాసం ఉంటున్న 14 అంతస్థుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

మొదటి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న దుబాయ్‌ పోలీసులు.. వారంపాటు విచారణ జరిపి ఆత్మహత్యగా నిర్ధారించి మిస్టరీని ఛేదించారు. ఆర్థిక ఇబ్బందులతోనే బలవన్మరణానికి పాల్పడ్డారని తెలిపారు. జాయ్ మృతదేహాన్ని యూఏఈ నుండి చార్టర్డ్ ఫ్లైట్ ద్వారా స్వ‌దేశానికి తీసుకొచ్చి స్వ‌స్థ‌ల‌మైన కోజీకోడ్‌ జిల్లా మనంతవడిలో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు బంధువులు తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top