25 మంది సైనికులను చంపి వీడియో తీశారు | IS video shows troops' deaths in Syria archaeological site | Sakshi
Sakshi News home page

25 మంది సైనికులను చంపి వీడియో తీశారు

Jul 5 2015 6:12 PM | Updated on Sep 3 2017 4:57 AM

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మరో దారుణానికి ఒడిగట్టారు.

బీరుట్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మరో దారుణానికి ఒడిగట్టారు. ఐఎస్ ఉగ్రవాదులు 25 మంది సిరియా సైనికులను కాల్చిచంపి.. ఈ దృశ్యాన్ని వీడియో తీసి ఆన్లైన్లో పెట్టారు. సిరియాలోని పల్మీరా అనే పట్టణంలో ఈ దారుణం జరిగింది.

ఐఎస్ ఉగ్రవాదులు సైనికులను ట్రక్కుల్లో తీసుకుని వచ్చి వరుసగా నిలబెట్టారు. వందలాదిమంది చూస్తుండగా వారిని కాల్చిచంపారు. మే 27న ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు సిరియా మానవ హక్కుల పర్యవేక్షణ సంస్థ వెల్లడించింది. పల్మీరా పట్టణాన్ని ఉగ్రవాదుల తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత సైనికులు, ఉద్యోగులను చంపినట్టు తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement