కరోనా: ఎంపీతో సహా ఒకే రోజులో 49 మంది మృతి | Iran Reports 49 New Deaths With Corona Virus | Sakshi
Sakshi News home page

కరోనాతో ఇరాన్‌ ఎంపీ మృతి..!

Mar 8 2020 6:33 PM | Updated on Mar 8 2020 6:43 PM

Iran Reports 49 New Deaths With Corona Virus - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

టెహ్రాన్‌ : ఇరాన్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 49 మంది మృతి చెందినట్లు ఆ దేశ అధికారులు ఆదివారం ధృవీకరించారు. కాగా కరోనా మహమ్మారికి ఇప్పటి వరకు ఆ దేశంలో మొత్తం 194 మంది మరణించారు. వైరస్‌ కారణంగా ఇరాన్‌ మాజీ దౌత్యాధికారి హోసేన్ షేఖోస్లామ్ ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ వార్త మరువముందుకే మరో ప్రజాప్రతినిధిని కరోనా కబలించింది. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు ఫతేమహ్ రహబర్ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయినట్టు ఇరాన్‌ మీడియా పలు కథనాలను వెల్లడించింది. (ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా)

రహబార్ ప్రస్తుతం టెహ్రాన్ పార్లమెంట్ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చైనా తర్వాత ఇరాన్‌లోనే అత్యధికంగా కరోనా మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు 194 మంది చనిపోగా, 5 వేలకుపైగా కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు ఇటలీలోనూ కరోనా వైరస్‌ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆ దేశంలో కరోనా ధాటికి ఇప్పటి వరకు 234 మృతి చెందగా.. 1247 కరోనా కేసులు నమోదయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement