భారీ వరదలు : 35 వేలమంది తరలింపు | Indonesia floods displace over 35,000 people | Sakshi
Sakshi News home page

భారీ వరదలు : 35 వేలమంది తరలింపు

Dec 24 2014 9:13 AM | Updated on Sep 2 2017 6:41 PM

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఇండోనేసియాలోని పశ్చిమ జావా, ఏచ్ ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి.

జకార్తా: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఇండోనేసియాలోని పశ్చిమ జావా,  ఏచ్ ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో దాదాపు 35 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఆ దేశ జాతీయ విపత్తు నివారణ సంస్థ ఉన్నతాధికారి వెల్లడించారు. వేలాది ఇళ్లు వరద నీటిలో చిక్కుకుపోయాయని తెలిపారు. నిరాశ్రయులకు ఆహారం పదార్థాలు, తాగు నీరు అందజేస్తున్నట్లు చెప్పారు. పోలీసులు, సైనికులతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

ఈ నెల 12న జావాలో మట్టి పెళ్ల విరిగిపడి 95 మంది మరణించారు. మరో 13 మంది జాడ తెలియరాలేదు. ఇండోనేసియాలో కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయి. దాంతో వరద పోటెత్తుతుంది అలాగే కొండ ప్రాంతంలో నివసించే జనావాసాలపై భారీగా కొండ చరియలు విరిగిపడుతున్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement