భారతీయులకు ఇళ్లను అద్దెకివ్వను! | I do not give homes to Indians for rent! | Sakshi
Sakshi News home page

భారతీయులకు ఇళ్లను అద్దెకివ్వను!

May 18 2017 2:24 AM | Updated on Sep 5 2017 11:22 AM

భారతీయులకు ఇళ్లను అద్దెకివ్వను!

భారతీయులకు ఇళ్లను అద్దెకివ్వను!

భారత్, పాకిస్తాన్‌ జాతీయులకు తన ఇళ్లను అద్దెకు ఇవ్వనని బ్రిటిష్‌ సంపన్నుడు ఫెర్గూస్‌ విల్సన్‌ చెబుతున్నాడు.

లండన్‌: భారత్, పాకిస్తాన్‌ జాతీయులకు తన ఇళ్లను అద్దెకు ఇవ్వనని బ్రిటిష్‌ సంపన్నుడు ఫెర్గూస్‌ విల్సన్‌ చెబుతున్నాడు. దీనిపై వివాదం రేగినా, న్యాయపర చర్యలు తీసుకునే అవకాశమున్నా ఆయన వెనక్కి తగ్గడం లేదు. ‘వారు ఇళ్లు ఖాళీ చేశాక భారతీయ వంటకాల వాసన వస్తుంది. మళ్లీ కార్పెట్లు వేయడానికి ఖర్చవుతుంది..అందుకే వారికి ఇళ్లను అద్దెకు ఇవ్వను. ఇది వారి శరీర వర్ణానికి సంబంధించిన సమస్య కాదు, కూర(కర్రీ)కు సంబంధించిన సమస్య..’ అని వాదిస్తున్నాడు.

వెయ్యికిపైగా ఇళ్లున్న ఫెర్గూస్‌ భారతీయులపై విధించిన ఈ నిషేధాన్ని బ్రిటన్‌ మానవ హక్కుల సంస్థ ఈక్వాలిటీ అండ్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌(ఈహెచ్‌ఆర్‌సీ) కోర్టులో సవాలు చేసింది. విల్సన్‌ నిర్ణయాన్ని నిలిపేస్తూ ఆదేశాలివ్వాలని సెంట్రల్‌ లండన్‌ కౌంటీ కోర్టును కోరామని సంస్థ ప్రతినిధి రెబెక్కా హిల్సెన్‌రథ్‌ తెలిపారు. భారత్, పాక్‌ జాతీయులకు ఇళ్లను కిరాయి ఇవ్వొద్దంటూ ఫెర్గూస్‌ తన ఏజెంట్లకు పంపిన ఈమెయిల్స్‌ లీక్‌ కావడంతో వివాదం రేగింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement