ఈ మ్యాథ్స్ ప్రొఫెసర్ మామూలోడు కాదు! | Hilarious prank where video started talking with math professor for real | Sakshi
Sakshi News home page

ఈ మ్యాథ్స్ ప్రొఫెసర్ మామూలోడు కాదు!

Apr 3 2016 5:35 PM | Updated on Sep 3 2017 9:08 PM

ఈ మ్యాథ్స్ ప్రొఫెసర్ మామూలోడు కాదు!

ఈ మ్యాథ్స్ ప్రొఫెసర్ మామూలోడు కాదు!

మ్యాథ్స్ అంటేనే విద్యార్థులకు ఓ రకమైన ఫీలింగ్ ఉంటుంది.

కాలిఫోర్నియా: మ్యాథ్స్ అంటేనే విద్యార్థులకు ఓ రకమైన ఫీలింగ్ ఉంటుంది. ఆ సబ్జెక్టుపై పట్టు సాధించిన విద్యార్థుల పరిస్థితి ఓకే గానీ.. మిగతా వారికి అది ఎప్పుడూ మిస్టరీనే. అయితే ఓ ప్రొఫెసర్.. రోజూ విద్యార్థులకు బోరింగ్ లెక్చర్ ఇవ్వడం కన్నా సమ్థింగ్ స్పెషల్గా ఏదైనా చేద్దామనుకున్నాడో లేక ఎప్రిల్ ఫస్ట్ సందర్భంగా తన స్టూడెంట్లను ఫూల్స్ను చేద్దామనుకున్నాడో గాని క్లాస్ రూంలో అతగాడు చేసిన హంగామా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
 
వివరాల్లోకి వెళ్తే.. కాలిఫోర్నియాలోని బయోలా యూనివర్సిటీ మ్యాథ్స్ ప్రొఫెసర్ మాథ్యూ వెదర్స్..  రోజువారి కార్యక్రమం మాదిరిగానే విద్యార్థులకు స్క్రీన్ పై పాఠాలు మొదలెట్టినా.. చివరికి మాత్రం వారిని సంబ్రమాశ్చర్యంలో ముంచెత్తాడు. స్క్రీన్పై  వీడియోతో కలిసి అతగాడు చేసిన విన్యాసాలు విద్యార్థులకు పిచ్చెక్కించాయి. క్లాస్ రూంలో ఆ ప్రొఫెసర్ చేసిన హంగామాకు సంబంధించిన వీడియో చూసి తీరాల్సిందే.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement