త్రికోణం... ఈ షేప్‌లో లైన్స్ నిటారుగా మూడు మూలలు (కోణాల) సమానంగా కలిసి ఉంటాయి. ఈ కోణాలను చూపుతూ – కుటుంబం, స్నేహితులు, టీచర్లు.. అనే మూడింటి ద్వారా జీవితాలు ఎలా నిలబడతాయో చెప్పవచ్చు. అలాగే లక్ష్యం, కష్టం, సహనం.. ఉంటే విజయానికి ఎలా చేరుతామో నేర్పచ్చు.
త్రిభుజాల షేప్స్‌లలో భిన్నమైనవి కూడా ఉంటాయి. రెండు లైన్స్ చిన్నగా, మూడవ లైన్ పొడవుగా కూడా ఉండవచ్చు. పొడవుగా ఉండే లైన్ మీరే’ అని చెప్పవచ్చు. ఆ పొడవైన లైన్ ద్వారా అందరికన్నా ఎంత క్రియేటివ్‌గా, ఎంత గొప్పగా, ‘నేను నా ఇండివిడ్యువాలిటీని చూపించాలి’ అనే ఆలోచన చూపవచ్చు.. అని వివరించవచ్చు.
దీర్ఘచతురస్రం...
ఈ షేప్‌లో నాలుగు స్ట్రెయిట్ లైన్స్ ఉంటాయి. అవి.. పుస్తకాలు, క్లాస్‌రూమ్ బోర్డు, టైమ్ మేనేజ్‌మెంట్, డిసిప్లిన్.. అవసరమని చెప్పవచ్చు.
చతురస్రం: సమానత్వం...
నాలుగు సైడ్లు సమానం కాబట్టి అందరినీ సమానంగా చూడాలి. ప్రశ్నించే స్వభావం, విలువలు నేర్పచ్చు.
సర్కిల్...
ఐక్యంగా కలిసిమెలిసి ఉండటం ఎలాగో చెప్పవచ్చు. సర్కిల్ అంటే మొదలు చివర లేకుండా కలిసి ఉండే షేప్. ఇందులో కుటుంబం, స్నేహం, టీమ్‌వర్క్ ఎప్పటికీ కొనసాగాలని చెప్పవచ్చు.
లైన్...
పొడవుగా ఉన్నా, చిన్నగా ఉన్న ఒక గీతను పేపర్‌పైన గీయండి. ఆ గీతను చూపుతూ ఒక గమ్యానికి నేరుగా వెళ్లే మార్గంలా, జీవితంలో లక్ష్యంపై దృష్టి పెట్టేలా నేర్పవచ్చు.
నిలువు గీతలు...
దగ్గర దగ్గరగా ఉండేలా కొన్ని నిలువు లైన్స్‌ని స్కేల్ సాయంతో గీయమని చె΄్పాలి. ఇవి ఒకదానిని ఒకటి అంటుకోవు. అంటే ఇతరుల స్పేస్‌కి గౌరవం ఇవ్వాలి అని వివరించవచ్చు.
సెమీసర్కిల్...
అర్ధచంద్రాకృతి. అర సగం షేప్‌ను చూపుతూ అసంపూర్ణత కూడా సహజమే అనే విషయాన్ని చె΄్పాలి. ప్రతి పని మొదట్లోనే పూర్తి కావాలని ఏమీ లేదు. క్రమంగా పూర్తి అవుతుందనే నిజాన్ని వివరిస్తూనే ధైర్యంగా ఉండటం ఎలాగో చెప్పవచ్చు.
ఈ షేప్స్ వల్ల పిల్లల్లో పరిశీలనాసక్తి, సమస్యను పరిష్కరించడం, టీమ్ వర్క్, సహనం, ఆత్మవిశ్వాసం వంటి జీవన నైపుణ్యాలు పెరుగుతాయి. వేసవి యాక్టివిటీలో భాగంగా జామెట్రీ షేప్స్‌ను తెల్లని పేపర్ మీద గీయమని చెబుతూ ఎన్నో విషయాలను చెప్పవచ్చు. వారినీ చెప్పమనవచ్చు. దీని వల్ల ఆలోచనాశక్తి, సృజనాత్మకత అలవడతాయి. - నిర్వహణ: నిర్మలారెడ్డి


