ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్(Devi Sri Prasad) హీరోగా మారిన సంగతి తెలిసిందే. ‘బలగం’ ఫేం వేణు యెల్దండి దర్శకత్వంలో ‘ఎల్లమ్మ’ (Yellamma Movie) అనే సినిమా చేస్తున్నాడు.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణలో ఉంది.
తాజాగా ఈ చిత్రం నుంచి ప్రత్యేక వీడియోని రిలీజ్ చేశారు. ఇందులో దేవిశ్రీ ప్రసాద్ సొంతూరు వెదురుపాక, అక్కడ అమ్మవారి జాతర విశేషాలను పంచుకున్నాడు.
తాను చెన్నైలో పెరిగినప్పటికీ.. నాన్నగారి సొంతూరు వెదురుపాక(తూర్పు గోదావరి జిల్లా) కు తరచూ వచ్చేవాడినని దేవి గుర్తు చేసుకున్నాడు. తమ మూలాలతో ఎప్పుడూ కనెక్ట్ అయి ఉండాలనే ఉద్దేశంతో అక్కడ ఒక అందమైన ఇల్లు కూడా నిర్మించుకున్నట్లు వీడియో ద్వారా పంచుకున్నాడు.
వెదురుపాక గ్రామ సంస్కృతి, అక్కడి జానపద కళల గురించి వివరిస్తూ.. ఆకారణంగానే తాను ‘ఎల్లమ్మ’ కథకి ఎస్ చెప్పానని ఆయన అన్నారు.


