‘ట్రంప్‌ నిర్ణయం వెనుక భారత్’ | Hafiz Saeed blame lies on India | Sakshi
Sakshi News home page

‘ట్రంప్‌ నిర్ణయం వెనుక భారత్’

Jan 2 2018 11:53 AM | Updated on Aug 25 2018 7:52 PM

Hafiz Saeed blame lies on India - Sakshi

ఇస్లామాబాద్‌ : ఉగ్రవాద సంస్థ జమాతే ఉద్‌ దవా(జేయూడీ) అధినేత, ముంబై దాడుల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ మరోసారి భారత్‌పై విషం కక్కాడు. పాకిస్తాన్‌కు అమెరికా నిధులు నిలిపివేయడం వెనుక భారత్‌ హస్తం ఉందని పేర్కొన్నాడు. భారత్‌ ఒత్తిడి కారణంగానే తమ దేశానికి సహాయక నిధులు నిలిపివేస్తూ డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. అమెరికా నిర్ణయంపై హఫీజ్‌ సయీద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇదిలావుండగా.. అమెరికా నిర్ణయంపై పాకిస్తాన్‌ ప్రధాని షాహీద్‌ ఖాన్‌ అబ్బాసీ అత్యవసరంగా ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాక్‌ నిఘా సంస్థ అయిన ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్‌ (ఐఎస్‌ఐ) సహా ఇతర ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement