నలుగురు పోలీసులను కాల్చి చంపారు | Four policemen killed by suspected Taliban militants in Pak | Sakshi
Sakshi News home page

నలుగురు పోలీసులను కాల్చి చంపారు

Jan 29 2016 8:17 AM | Updated on Sep 3 2017 4:34 PM

పాకిస్థాన్లో ఉగ్రవాదుల పెట్రేగిపోయారు. నలుగురు పోలీసులను దారుణంగా కాల్చిచంపారు.

కరాచీ: పాకిస్థాన్లో ఉగ్రవాదుల పెట్రేగిపోయారు. నలుగురు పోలీసులను దారుణంగా కాల్చిచంపారు. బాలోచిస్తాన్లోని క్వెట్టా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తాలిబన్ సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు బైక్లపై వచ్చి అనూహ్యంగా ఓ పోలీసు మొబైల్ వ్యాన్పై విచ్చలవిడిగా కాల్పులు జరిపారు.

దీంతో ఇద్దరు పోలీసులు అక్కడికక్కడే చనిపోగా మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. ఈ కాల్పులకు తామే బాధ్యత వహిస్తూ తెహ్రిక్ ఈ తాలిబన్ సంస్థ మీడియాకు ఈమెయిల్ విడుదల చేసింది. బాలోచిస్తాన్ ప్రావిన్స్లో ఈ మధ్య ఉగ్రవాద దాడులు ఎక్కువగా పెరిగిపోయాయి. ఇదే నెలలో ఇదే చోట ఆత్మాహుతి దాడి జరపగా ముగ్గురు సామాన్యులతోపాటు 12మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement