పుతిన్ గిఫ్ట్‌లో మైక్రోచిప్..!

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య హెల్సింకిలో జరిగిన సమావేశం సంచలనాలు రేకెత్తిస్తోంది. ఈ సదస్సులో పుతిన్, ట్రంప్‌నకు ఫుట్‌బాల్‌ను ప్రెజెంట్ చేశారు. అయితే, బంతిలో మైక్రోచిప్ ఉందంటూ అమెరికా సెనేటర్ లిండ్స్ గ్రాహమ్ సంచలన ఆరోపణలు చేశారు. అయితే, ఇది నిజమేనని తేలింది. ఫుట్‌బాల్‌లో మైక్రోచిప్ ఉంది. అది రష్యా అమర్చినది కాదు. అడిడాస్ కంపెనీ తయారు చేసిన ఆ బంతిలో చిప్‌ను అమర్చినట్లు కంపెనీ ప్రకటించింది
ప్రపంచకప్ సందర్భంగా బంతిని ప్రత్యేకంగా తయారు చేసినట్లు పేర్కొంది. అందులో అమర్చిన చిప్ ద్వారా తన్నడానికి దగ్గరకు వచ్చిన ఆటగాడి వివరాలను ప్రేక్షకులకు చేరవేసేందుకు ఇలా చేశామని తెలిపింది. కాగా, పుతిన్ గిఫ్ట్‌గా ఇచ్చిన ఫుట్‌బాల్‌ను ట్రంప్ 12 ఏళ్ల బారన్(ట్రంప తనయుడు)కు ఇచ్చారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి