ఉపవాసం మేలు గుట్టు తెలిసింది  | Fasting is good for the health | Sakshi
Sakshi News home page

ఉపవాసం మేలు గుట్టు తెలిసింది 

Nov 8 2017 3:11 AM | Updated on Nov 8 2017 3:11 AM

Fasting is good for the health - Sakshi

తరచూ ఉపవాసం ఉండటం వల్ల ఆయువు పెరుగుతుందని వింటుంటాం.. ఇందుకు కారణాలను సశాస్త్రీయంగా హార్వర్డ్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు. కణాల్లోని మైటోకాండ్రియా నెట్‌వర్క్‌ల చర్యలను మార్చడం ద్వారా ఉపవాసం ఆయువును పెంచడంతో పాటు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని ప్రయోగపూర్వకంగా తెలుసుకున్నారు.

ఈ మైటోకాండ్రియానే కణాలకు అవసరమైన శక్తిని తయారు చేస్తుంది. హార్వర్డ్‌ శాస్త్రవేత్తలు నులిపురుగులపై ప్రయోగాలు చేశారు. రెండు వారాల పాటే బతికే ఈ నులిపురుగులకు అందే ఆహారాన్ని నియంత్రించినప్పుడు వేర్వేరు కణాల్లోని మైటోకాండ్రియాలు స్థిరంగా ఉండిపోయినట్లు గుర్తించారు. సాధారణ పరిస్థితుల్లో మైటోకాండ్రియా ఒక దశ నుంచి ఇంకోదశకు సులువుగా మారేందుకు ఈ ప్రక్రియ వీలు కల్పిస్తుందని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఉపవాసం కారణంగా మైటోకాండ్రియా.. ఆక్సిజన్‌ సాయంతో కొవ్వులను మండించే భాగాలైన పెరాక్సీసోమ్స్‌ మధ్య సమన్వయం కూడా పెరిగిందని తెలిసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement