ట్విటర్‌కు ట్రంప్‌.. బైబై?! | Donald Trump quit Twitter? | Sakshi
Sakshi News home page

ట్విటర్‌కు ట్రంప్‌.. బైబై?!

Nov 3 2017 8:34 AM | Updated on Apr 3 2019 8:07 PM

 Donald Trump quit Twitter? - Sakshi

వాషింగ్టన్‌ : గురువారం సాయంత్రం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రంప్‌ అభిమానులకు, వ్యతిరేకులకు కొన్ని క్షణాలు పాటు ఏం జరిగిందో అర్థం కాలేదు. ట్రంప్‌ ట్విటర్‌కు గుడ్‌బై చెప్పారా? ఇది నిజమేనా? ట్రంప్‌ అసలెందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? అనే ప్రశ్నలు అందరినుంచి వచ్చాయి. ట్రంప్‌ పర్సనల్‌ ట్విటర్‌ అకౌంట్‌లో ఫాలోవర్ల సంఖ్య 41.7 మిలియన్లు. ఇంతటి ఫాలోయింగ్‌ను ట్రంప్‌ వదులుకున్నారా? అనే ప్రశ్న కూడా వచ్చింది. అసలేం జరిగింది అన్న సందిగ్ధం గురువారం సాయంత్రం మొదలైంది.

ఇంతకూ జరిగిన విషయమేమింటే.. గురువారం సాయంత్రం @realdonald trump అకౌంట్‌ మెసేజ్‌ చేస్తే.. ట్విటర్‌ నుంచి ఈ పేజీ ఇప్పడు పనిచేయడం లేదు అనే రిప్లయి మెసేజ్‌ వచ్చింది. దీంతో ఒక్కసారిగా అందరిలోనూ ట్రంప్‌ ట్విటర్‌ నుంచి బయటకు వెళ్లిపోయారని అనుకున్నారు. అయితే వాస్తవంగా.. ట్విటర్‌లో పనిచేసే ఒక ఉద్యోగి చేసిన పొరపాటు వల్ల ట్రంప్‌ వ్యక్తిగత అకౌంట్‌ 11 నిమిషాల పాటు పూర్తిగా నిలిచిపోయింది. అయితే జరిగిన పొరపాటు తెలుసుకొన్న ట్విటర్‌ అధికారులు.. వెంటనే ట్రంప్‌ అకౌంట్‌ను పునరుద్ధరించారు.

ట్రంప్‌ అకౌంట్‌కు ఇలా ఎందుకు జరిగిందన్న విషయంపై విచారణ చేస్తున్నట్లు ట్విటర్‌ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement