ఆ నౌకలోని మూడో ఇండియన్‌కు కోవిడ్‌-19

Coronavirus : Third Indian Tests Positive In British Cruise Ship In Japan - Sakshi

న్యూఢిలీ/టోక్యో : కోవిడ్‌-19 (కరోనా వైరస్‌) భయంతో జపాన్‌లోని యెకోహూమా తీరంలో నిలిపివేసిన ‘డైమండ్‌ ప్రిన్సెస్’  నౌకలోని భారతీయుల పరిస్థితి రోజురోజుకు ఆందోళకరంగా మారుతుంది. ఇక్పటికే ఆ నౌకలోని ఇద్దరు భారతీయులకు కరోనా వైరస్‌ సోకిన సంగతి తెలిసిందే. తాజాగా మరో వ్యక్తికి కరోనా వైరస్‌ సోకినట్టు టోక్యోలోని భారత ఎంబసీ ధ్రువీకరించింది. ప్రస్తుతం బాధితులతో టచ్‌లో ఉన్నామని భారత ఎంబసీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారికి ఆస్పత్రిలో చికిత్స అందుతుందని.. ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడించారు. 

ఆ నౌకలోని మొత్తం 3700 మందిలో 138 భారతీయులు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు అందించిన సమాచారం ప్రకారం మొత్తంగా ఆ నౌకలోని 170 మందికి కరోనా వైరస్‌ సోకినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆ నౌకలోని భారతీయులు తమను కాపాడాలని భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. సాయం కోరుతూ పలువురు బాధితుల పంపిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు ఆ నౌకలోని భారతీయులు పరిస్థితిపై స్వదేశంలోని వారి కుటుంబ సభ్యులు, బందువుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తమవారిని క్షేమంగా తీసుకురావాలని వారు కూడా భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. 

చదవండి : ఒంటరిగా నిర్భంధించారు.. సాయం అందించండి

కరోనా కాటేస్తోంది కాపాడరూ..!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top