కొలంబో తీరంలో నౌకలో మంటలు | Colombo fire on the missel | Sakshi
Sakshi News home page

కొలంబో తీరంలో నౌకలో మంటలు

Apr 5 2017 11:19 AM | Updated on Sep 5 2017 8:01 AM

శ్రీలంక రాజధాని కొలంబో తీరం సమీపంలో వ్యాపార నౌక డానియాలాపై అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా నౌకలో మంటలు చెలరేగాయి.

కొలంబో: శ్రీలంక రాజధాని కొలంబో తీరం సమీపంలో వ్యాపార నౌక డానియాలాపై అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా నౌకలో మంటలు చెలరేగాయి. శ్రీలంక ప్రభుత్వం నుంచి సమాచారమందుకున్న భారత్‌ సాయం నిమిత్తం రెండు నేవీ ఓడలను బుధవారం తెల్లవారుజామున అక్కడికి పంపించింది.
 
ఐఎన్‌ఎస్‌ ఘరియల్‌, ఐఎన్‌ఎస్‌ దర్శక్‌ ఓడలు తీరానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు భారత నేవీ తెలిపింది. దీంతోపాటు ఓ తీరప్రాంత ఓడ శూర్‌ను కూడా కొలంబోకు పంపినట్లు అధికారులు తెలిపారు. తీరానికి 11 నాటికల్‌ మైళ్ల దూరంలో కార్గో ఓడ డానియలా అగ్నిప్రమాదానికి గురైనట్లు సమాచారం వచ్చిందని భారత నేవీ అధికార ప్రతినిధి కెప్టెన్‌ డీకే శర్మ ట్వీట్‌ చేశారు. అత్యవసర సహాయక చర్యలు అవసరపడటంతో రెండు ఓడలను పంపినట్లు డీకే శర్మ పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement