ఎప్పటికప్పుడు సమాచారం పంచుకున్నాం | China exonerates self in whitepaper on COVID-19 | Sakshi
Sakshi News home page

ఎప్పటికప్పుడు సమాచారం పంచుకున్నాం

Jun 8 2020 4:40 AM | Updated on Jun 8 2020 4:40 AM

China exonerates self in whitepaper on COVID-19 - Sakshi

శ్వేతపత్రం చూపుతున్న డాక్టర్‌ వాంగ్‌

బీజింగ్‌: ప్రాణాంతక కరోనా వైరస్‌పై సరైన సమయంలో ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయలేదన్న నేరారోపణలు ఎదుర్కొంటున్న చైనా.. తాజాగా వైరస్‌కు సంబంధించి శ్వేత పత్రాన్ని ఆదివారం విడుదల చేసింది. వైరస్‌ విషయాన్ని దాచిపెట్టలేదని, ఇందులో తమ తప్పు, పొరపాటు ఏమీ లేదని సమర్థించుకుంటూ సమగ్ర వివరణ ఇచ్చింది. ఈ కరోనా వైరస్‌ను తొలిసారి వూహాన్‌లో గత సంవత్సరం డిసెంబర్‌ 27న ఒక ఆసుపత్రిలో వైరల్‌ న్యూమోనియాగా గుర్తించామని వెల్లడించింది. మనిషి నుంచి మనిషికి సోకుతుందన్న విషయాన్ని జనవరి 19న నిర్ధారించామన్నారు. ఆ వెంటనే వైరస్‌ వ్యాప్తి నిరో«ధ చర్యలు ప్రారంభించామంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సహా పలువురు ప్రపంచ దేశాధి నేతలు కరోనా మారణకాండకు, ఆర్థిక అస్తవ్యస్తతకు చైనానే కారణమని ఆరోపణలు చేస్తుండటం తెలిసిందే.  

జనవరి 19కి ముందు, ఆ వైరస్‌ మనుషుల నుంచి మనుషులకు సోకుతుందనేందుకు శాస్త్రీయ ఆధారాలు లభించలేదని వైరస్‌ వ్యాప్తిపై చైనా నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌(ఎన్‌హెచ్‌సీ) ఏర్పాటు చేసిన అత్యున్నత శాస్త్రవేత్తల కమిటీ సభ్యుడు, ఊపిరితిత్తుల వ్యాధి నిపుణుడు వాంగ్‌ గ్వాంగ్‌ఫా పేర్కొన్నారు. వూహాన్‌కు తాము వెళ్లినప్పటికే.. అక్కడ జ్వర పీడితుల సంఖ్య అనూహ్యంగా పెరిగిందన్నారు. వైరస్‌ను తొలుత గుర్తించిన మాంసాహార మార్కెట్‌కు వెళ్లని వారికి కూడా ఈ వ్యాధి సోకినట్లు గుర్తించామన్నారు. జనవరి 14 నాటికి వూహాన్‌ నగరం ఉన్న హ్యుబయి రాష్ట్రం మొత్తం వైరస్‌ వ్యాప్తి ముప్పు ఉన్నట్లు గుర్తించిన ఎన్‌హెచ్‌సీ.. ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిందని శ్వేతపత్రంలో పేర్కొన్నారు.

నిర్ధారించలేని కారణంతో న్యూమోనియా రావడాన్ని గుర్తించిన తక్షణమే అందుకు కారణాలను అన్వేషించాలని పరిశోధకులను ప్రభుత్వం ఆదేశించిందని వివరించారు. ముప్పును గుర్తించిన చైనా వెంటనే ప్రపంచ ఆరోగ్య సంస్థను, అమెరికా సహా ఇతర దేశాలను అప్రమత్తం చేసిందన్నారు. అనంతరం, ఈ కొత్త కరోనా వైరస్‌ జన్యుక్రమాన్ని పరిశోధించి, ఆ వివరాలను కూడా డబ్ల్యూహెచ్‌ఓ, ప్రపంచ దేశాలతో పంచుకుందన్నారు. హ్యుబయితో పాటు ఇతర ప్రాంతాలకు విస్తరించడంతో దేశంలో కూడా వైరస్‌ వ్యాప్తిని అరికట్టే చర్యలు ప్రారంభించామని తెలిపారు. జనవరి 3 నుంచే వైరస్‌ సంబంధించిన వివరాలను డబ్ల్యూహెచ్‌ఓతో పాటు ఇతర దేశాలతో పంచుకున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement