బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో గత వారంలో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. సోమవారానికి మృతుల సంఖ్య 35కు చేరుకుంది.
బ్రస్సెల్స్ : బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో గత వారంలో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. సోమవారానికి మృతుల సంఖ్య 35కు చేరుకుంది.బాంబు పేలుళ్ల ఘటనకు తమదే బాధ్యతని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. బ్రస్సెల్స్ ఎయిర్ పోర్టు, మెట్రోస్టేషన్ లో వరుస పేలుళ్ల ఘటనలో మొత్తం ఆరుగురు ఉగ్రవాదులు పాల్గొనగా, ఇద్దరు ఆత్మాహుతి దాడికి పాల్పడినట్టు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు.మూడో అనుమానితుడి ఊహా చిత్రాన్ని పోలీసులు సోమవారం విడుదల చేశారు.
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది, ప్యారిస్ లో బాంబుదాడులకు పాల్పడిన సలాహ్ అబ్దెస్లామ్ను అరెస్టు చేసిన నాలుగు రోజుల్లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. సలాహ్ అబ్దెస్లామ్ సోదరులే ఘటనకు కారణమని అధికారులు భావిస్తున్నారు. కాగా ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాల ముమ్మర వేట కొనసాగుతుంది.