
సాక్షి, పార్వతీపురం మన్యం జిల్లా: పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బాంబు పేలుడు కలకలం రేగింది. పార్శిల్ సర్వీస్ సెంటర్‌లో బాంబు పేలింది. నలుగురికి గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. విజయనగరం నుంచి పార్శిల్ వచ్చినట్లు గుర్తించారు. పేలుడు ధాటికి పార్శిల్ సర్వీస్ గోడౌన్ ధ్వంసమైంది. పార్శిల్ ప్యాకింగ్‌లు చెల్లాచెదురయ్యాయి.