కొంపముంచిన అగరుబత్తి; వీడియో వైరల్‌ | BMW Car Set In Fire Sparks From Incense | Sakshi
Sakshi News home page

కొంపముంచిన అగరుబత్తి; వీడియో వైరల్‌

Jun 15 2018 4:40 PM | Updated on Apr 3 2019 4:59 PM

BMW Car Set In Fire Sparks From Incense - Sakshi

మంటల్లో కాలిపోతున్న యాంగ్జు కొత్త బీఎమ్‌డబ్ల్యూ కార్‌

బీజింగ్‌, చైనా : ‘కొండ నాలుకకు మందేస్తే...ఉన్న నాలుక ఊడిపోయనట్ల’యింది ఓ వ్యక్తి పరిస్థితి. కొత్త బీఎమ్‌డబ్ల్యూ కార్‌ కొన్న ఆ వ్యక్తి దాన్ని పూజ చేసి​ ప్రారంభిద్దామనుకున్నాడు. అదే అతడి కొంప కాదు కాదు కారును ముంచింది. పూజ చేసి వెలిగించిన అగరుబత్తి కాస్త కారుకు కూడా అంటుకోవడంతో 50 లక్షల రూపాయల విలువ చేసే కొత్త బీఎమ్‌డబ్ల్యూ కారు చూస్తుండగానే మంటల్లో కాలిపోయింది. దీనికి సంబంధిన వీడియో కాస్తా ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది.

వివరాల ప్రకారం చైనాలోని జింగ్సూ పట్టణానికి చెందిన యాంగ్జు కొత్త బీఎమ్‌డబ్ల్యూ కార్‌ కొన్నాడు. పూజ చేసి ప్రారంభిద్దామనే ఉద్దేశంతో కారు ముందు ఒక ఎర్ర రంగు వస్త్రం పరిచి, అగరు బత్తులు ముట్టించాడు. అయితే పొరపాటున ఆ వస్త్రం కూడా అంటుకుంది. అంతటితో ఆగక ఆ వస్త్రం కాస్తా వెళ్లి కొత్త బీఎమ్‌డబ్ల్యూ కార్‌ మీద పడింది. ఇంకేముంది...చూస్తుండగానే క్షణాల్లోనే కారు పూర్తిగా కాలి పోయింది. ఈ తతంగమంతా అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డయ్యింది. సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన ఈ వీడియో ఇప్పుడు తెగ వైరలవుతుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement