అతనో పెద్ద కమెడియన్.. పట్టించుకోకండి! | Bashir Ahmad says Muslim MMA star appalled by the cult of Donald Trump | Sakshi
Sakshi News home page

అతనో పెద్ద కమెడియన్.. పట్టించుకోకండి!

Feb 23 2016 4:37 PM | Updated on Aug 25 2018 7:50 PM

అతనో పెద్ద కమెడియన్.. పట్టించుకోకండి! - Sakshi

అతనో పెద్ద కమెడియన్.. పట్టించుకోకండి!

డొనాల్డ్ ట్రంప్, ఆయన అంతేవాసులైన రిపబ్లికన్లు సాగిస్తున్న ఎన్నికల ప్రచారం అమెరికాలోని ముస్లింలలో అభద్రతా భావాన్ని రేకెత్తిస్తోంది.

వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్, ఆయన అంతేవాసులైన రిపబ్లికన్లు సాగిస్తున్న ఎన్నికల ప్రచారం అమెరికాలోని ముస్లింలలో అభద్రతా భావాన్ని రేకెత్తిస్తోంది. అవకాశాల స్వర్గమైన అగ్రరాజ్యంలో తాము ఏకాకులమైన భావనను ట్రంప్ డప్పు కొట్టిమరీ చేస్తున్న అధ్యక్ష ఎన్నికల ప్రచారం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ లో జన్మించి.. ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న ప్రముఖ బాక్సర్  బషీర్ అహ్మద్ ట్రంప్ ప్రచారంపై స్పందించాడు. 'ట్రంప్ లాంటివాళ్లు మాట్లాడితే వింటే నాకు కామెడీ లాగా అనిపిస్తుంది' అని ఆయన పేర్కొన్నాడు.

అమెరికా సైన్యంలో చేరి ఆఫ్గనిస్థాన్ లోనూ జవాన్ గా పనిచేసిన ఆయన మాట్లాడుతూ అమెరికా మూక సంస్కృతిని ట్రంప్ కంట్రోల్ చేస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఆయన ప్రచార సరళీ మొత్తం ఇలాగే ఉందని, ముస్లింలను ఎవరూ ఎక్కువ ద్వేషిస్తారు? అన్న రీతిలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల చర్చలు జరుగుతున్నాయని అన్నారు. ఆసియా వన్ చాంపియన్ షిప్ లో పాకిస్థాన్ తరఫున ఎంఎంఏ ఫైటర్ గా పాల్గొంటున్న బషీర్ అహ్మద్ తాను గ్లోబల్ పౌరుడినని, అయినప్పటికీ ట్రంప్ తీరు అమెరికాలోని ముస్లింలకు ఆందోళన కలిగిస్తున్నదని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement